స్పైసీ టమోటో – ఉల్లిపాయ సబ్జీ

Spicy Tomato Onion Curry for rice

కావల్సిన పదార్థాలు: 

 • 6 మీడియం టొమాటోలు
 • 1 పెద్ద ఉల్లిపాయ
 • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
 • 1/4 tsp పసుపు పొడి
 • 1 స్పూన్  కారం పొడి
 • 2 tsp దనియాల పొడి
 • 2 టేబుల్ స్పూన్లు నూనె
 • 1 టేబుల్ స్పూన్ శనగ పప్పు
 • 1 టేబుల్ స్పూన్ ఉద్ది పప్పు
 • 1 tsp ఆవాలు
 • 1 tsp జీలకర్ర
 • రుచికి సరిపడా ఉప్పు
 • కొత్తిమీర, కరివేపాకు

 

వెజిటబుల్ కిచిడీ (Vegetable Khichdi) ఎలా ?

మ్యాంగో పులిహోరా(మ్యాంగో రైస్) తయారు చేయడం ఎలా ?

 

తయారుచేయు విధానం: 

 1. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి, నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగానివాలి.
 2. వేగిన తర్వాత పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 3 లేదా 4 నిముషాలు వేగించుకోవాలి.
 3. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా , అందులో పసుపు పొడి వేసి బాగా కలియబెడుతూ బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేస్కుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి, టమోటో ముక్కలు మరియు ఉప్పు వేసి వేగించుకోవాలి.
 4. టమోటో మెత్తబడేవరకూ సన్నని మంట పైన ఉడికించాలి. గరిటెతో టమాటో  ప్రెస్ చేస్తూ కలియబెట్టడం వల్ల టమోటో మెత్తగా గుజ్జులా తయారవుతుంది.
 5. టమోటో గుజ్జుగా అయిన తర్వాత అందులో ధనియాల పొడి, కారం పొడి  వేసి మరో నిముషం ఉడికించుకోవాలి. కారం పొడి వాసనా పోయే వరకు సన్నని మంట పైన కలియబెడుతూ ఉండాలి.
 6. అన్నింటిని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే స్పైసీ టమోటో ఆనియన్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీ సైడ్ డిష్ గా సర్వ్ చేయవచ్చు.