మంగో జ్యూస్ తయారీ, మామిడి పండ్లు తినడం వలన ప్రయోజనాలు!!

How To Make Pure Mango Juice At Home, How To Make Mango Juice Step by Step, Homemade Mango Juice, Mango Juice Recipe, How to make mango juice, Benefits Of Mango Juice, Mango Juice Health Benefits, Manatelugunela,

మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్న కూడా , మామిడి పండుకు మాత్రమే రారాజ పీఠం దక్కుతుంది. ఒక ప్రత్యేకమైన రుచితో పాటు విశిష్టమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాత్మక అంశాలు కలిగి ఉండటం వలననే దానికి ఆ అగ్రస్థానం లభించింది. పక్వమైన తియ్యగా ఉన్న మామిడిపండులో ఎన్నో మనకు మేలు చేసే గుణాలు ఉంటాయి..

మామిడి పండ్లు తినడం వలన ప్రయోజనాలు :

1. మామిడి పండ్లు తినడం వలన శుక్రకణవర్ధకమై శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
2. మలమూత్ర విసర్జన సాఫీగా జరిగేలా మామిడి సహాయపడుతుంది.
3. గుండె కండరాలకు శక్తినిచ్చి సక్రమంగా పని చేసేలా చేస్తుంది, రక్తప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది.
4. ఆకలిని పెంచి, అజీర్తిని పోగొట్టేల చేస్తుంది.
5. మన శరీరకాంతిని, వర్చస్సును పెంచేలా చేస్తుంది.
6. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, కంటి చూపుకు మంచిది, చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది, శరీరాన్ని ఆల్కలైజ్ చేస్తుంది మరియు రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది.
ర‌క్తం కార‌డం, చిగుళ్ల ఇన్‌ఫెక్ష‌న్‌, దంతాల నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మామిడి పండ్ల‌ను తింటే మంచి ఫ‌లితం ఉంటుంది.

మంగో జ్యూస్ తయారీ విధానం :

1. ముందుగా మామిడి పండ్లని తీస్కొని నీటితో బాగా శుభ్రం చేస్కోవాలి, తర్వత మామిడి పండ్ల తొక్కను తీసివేసి చిన్నగా కట్ చేస్కోవాలి.
2. మామిడి పండ్ల ముక్కలను మిక్సర్ లోకి తీస్కొని, అందులోకి కొంచం నీరు లేదా ఐస్ ముక్కలని జోడించి మెత్తగా చూర్ణం చేయండి.
3. ఒక జల్లెడ ఉపయోగించి మామిడిపండు రసంను ఫిల్టర్ చేయండి.
4. మామిడిపండు గుజ్జు లో పంచదార లేదా తేనె వేస్కొని మిక్స్ చేయండి.
5. అవసరమైతే మరింత ఐస్ ముక్కలని & నీరు కలుపుకోండి.
6. రుచికరమైన మామిడి రసం ఇప్పుడు సిద్ధంగా ఉంది. గ్లాస్ లోకి తీస్కొని తగేయండి.

  • 3
    Shares