అక్కకే ఆఫర్స్ లేవు, మధ్యలో తమ్ముడి ఎంట్రీ !!


రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో దాదాపు అందరి హీరోలతో కలసి నటించింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది, కానీ అక్కడ రకుల్ అనుకునంత రిజల్ట్ పొందలేదు. తిరిగి మళ్ళి సౌత్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రకుల్ కి సౌత్ లో టైం అసలు బాగోలేదు, తను నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటూన్నాయి. ప్రస్తుతం రకుల్ చేతిలో కొత్త ఆఫర్స్ కూడా ఏమి లేవు.

 

ఈ టైం లో ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మ్ముడు అమన్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఫిబ్ర‌వ‌రి 24 ఉదయం 10 గంటలకు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అమ‌న్ సినిమా లాంచ్ చేయనున్నారు. రజినీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు దాసరి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.