మ్యాంగో పులిహోరా(మ్యాంగో రైస్) : ఉగాది స్పెషల్

How to make Raw Mango Rice, Mamidikaya Pulihora, Mango Rice, Mamidikaya Pulihora In Telugu, Mango Rice Recipe, Raw Mango Rice, How to prepare Mamidikaya pulihora

 

కావల్సి పదార్థాలు:

 

 • రైస్: 3cups( అన్నం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి)
 • పచ్చిమామిడికాయ తురుము: 11/2 cup(పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి)
 • వేరుశెనగలు: 5-6tbsp( వేగించినవి)
 • జీడిపప్పు :2tbsp(రోస్ట్ చేసుకోవాలి)
 • ఉప్పు: రుచికి సరిపడా
 • పోపు కోసం:
 • నూనె: 1 1/2tbsp
 • ఆవాలు: 1tbsp
 • శెనగపప్పు: 1tbsp
 • ఉద్దిపప్పు: tbsp
 • ఎండు మిర్చి: 3-4
 • పచ్చి మిర్చి: 6-8(మద్యలోకి కట్ చీలికగా కట్ చేసి పెట్టుకోవాలి)
 • తురిమిన అల్లం: 1tsp
 • ఇంగువ: 1/4tsp
 • పసుపు: 1/4 tsp
 • కరివేపాకు: రెండు రెమ్మలు

వెజిటబుల్ కిచిడీ (Vegetable Khichdi) ఎలా ?

 షహీ మష్రుమ్ రిసిపి తయారీ ఎలా ?

తయారుచేయు విధానం :

 

 1. ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి.
 2. ఆవాలు చిటపలాడిన తరవ్ాత అందులో శెనగపప్పు, ఉద్దిబాళ్ళు, వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వెంటవెంటనే అందులో పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం, పసుపు మరియు ఇంగువ వేసి, కొన్ని సెకండ్లు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
 3. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమామిడి తురుము వేసి మరోకొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
 4. తర్వాత అందులోనే రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు మరియు జీడిపప్పు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 5. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకొన్న అన్నంను పోపులో వేసి, ఉప్పు చిలకరించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో తెలుకొని సరిపడా వేసి మిక్స్ చేసి అడ్జెస్ట్ చేసుకోవాలి.
 6. అంతే మామిడికాయ పులిహోర రెడీ. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోరతో పాటు సైడ్ గా వడియాలు, పెరుగు లేదా పచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.