గోంగూర మటన్ తయారీ విధానం..!

అదిరిపోయే స్పెషల్‌ గోంగూర మటన్ కర్రీ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి..

కావలసిన పదార్థాలు: 

మటన్‌- అర కిలో
గోంగూర- 3 కట్టలు
తరిగిన పచ్చిమిర్చి- 6
తరిగిన ఉల్లిపాయ- ఒకటి
పసుపు- ఒక టీ స్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్‌ స్పూను
గరం మసాలా- ఒక టీ స్పూను
నూనె- ఒక టేబుల్‌ స్పూను
కారం- 2 టీ స్పూన్లు
ధనియాల పొడి- ఒక టీ స్పూను
జీలకర్ర పొడి- అర టీ స్పూను
ఉప్పు- రుచికి తగినంత

తయారీ విధానం: 

ముందుగా కుక్కర్‌లో మటన్‌, ధనియాల పొడి,జీలకర్ర పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టి స్టవ్ మీద నాలుగు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక అందులో ఉల్లిపాయలు,అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలియబెడుతూ ఒక నిమిషం సేపు వేగించాలి. తర్వాత అందులో గోంగూర, పసుపు మరియు పచ్చిమిర్చి, వేసి బాగా కలిపి చిన్న మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న మటన్‌ వేసుకొని, దానికి తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు దించేసుకోవాలి.

వేడి వేడి గోంగూర మటన్ రెడీ, మీరు కూడా ఈ ప్రాసెస్ లో చేసుకుని గోంగూర మటన్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వంటకాల గురించి తెలుసుకోవడానికి www.manatelugunela.com చూస్తూ ఉండండి.