మన ఇంటిలోనే ఫ్రూట్ సలాడ్‌ తయారు చేసుకునే విధానం..!

కావలసిన వస్తువులు:

మామిడిపండు ముక్కలు – ఒక కప్పు
చెర్రీ పండ్లు – అర కప్పు
అరటిపండు ముక్కలు – ఒక కప్పు
దానిమ్మ గింజలు – ఒక కప్పు
నిమ్మ రసం – రెండు స్పూన్లు
పైనాపిల్ ముక్కలు – ఒక కప్పు
ద్రాక్షపళ్ళు – ఒక కప్పు
ఆపిల్ పండు ముక్కలు – ఒక కప్పు
కమలపండు ముక్కలు – ఒక కప్పు
మిరియాలపొడి – అరస్పూన్
ఉప్పు – కొంచెం
తేనె – పావు కప్పు

తయారీ విధానం:

ముందుగా తీసుకున్న పండ్లని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఓ పెద్ద బౌల్‌లో తీసుకోవాలి. వీటి మీద కొంచం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం పిండి పైన తేనె వేసి మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది. మూడు గంటల తర్వాత సలాడ్‌ను ఒక కప్ లో ఐస్‌క్రీమ్‌తో కలిపి సర్వ్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *