పాత రికార్డ్స్ ని బ్రేక్ చేసిన హీరో రామ్ !

Vunnadhi Okate Zindagi Hindi Dubbing

రామ్, అనుపమ పరమేశ్వరన్ మరియు లావణ్య త్రిపాఠి న‌టించిన `ఉన్న‌ది ఒకటే జిందగీ` తెలుగు లో యావరేజ్ టాక్ తెచుకుంది.ఈ చిత్రం లో స్నేహం విలువ చెప్పిన క‌థ‌, క‌థ‌నం, దేవిశ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన బాణీలు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలైట్ అయ్యాయి. అయితే ఈ చిత్రం హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `నెం.1 దిల్ వాలా` యూ ట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. యు ట్యూబ్ డబింగ్ సినిమా వ్యూస్ ప్రకారం చుస్తే హీరో రామ్ ‘నెం.1 దిల్ వాలా’ తో పాత యూ ట్యూబ్ వ్యూస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసినట్లే.

ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై మ‌నీష్ షా విడుద‌ల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ప‌ట్ల హిందీ అనువాద హ‌క్కులు తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మ‌నీష్ షా ఆనందం వ్య‌క్తం చేశారు.