వెజిటబుల్ కిచిడీ – Vegetable Khichdi – Mana Telugu Nela

వెజిటేబుల్ కిచిడి: కిడ్స్ స్పెషల్

 

కావల్సిన పదార్థాలు: 

 

రైస్ – 1cup

పెసరపప్పు – 1/2cup

బంగాళాదుంప – 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి) 

కాప్సికమ్ – 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి) 

గ్రీన్ బఠానీలు – 1/2cup 

గ్రీన్ చిల్లి – 2 (చిన్న ముక్కలుగా తరిగివి) 

అల్లం – 1 అంగుళాల పొడవు ముక్క (తురిమినది) 

నెయ్యి – 1 లేదా 2 tsp 

హింగ్(ఇంగువ) – 1-2 చిటికెడు 

జీలకర్ర – 1/2tbsp

నల్ల మిరియాలు- 4-6 

లవంగాలు – 4 

పసుపు – 1/6 tsp 

ఉప్పు – రుచి సరిపడా

కొత్తిమీర- 1tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

 

తయారుచేయు విధానం: 

  1. ముందుగా బియ్యం మరియు పప్పును శుభ్రంగా కడిగి, అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కుక్కర్ ను స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా నెయ్యి వేసి, వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు ఇంగువ వేసి వేయించుకోవాలి.
  3. జీకలర్ర చిటపటలాడిన తరవ్ాత అందులో బ్లాక్ పెప్పర్, లవంగాలు, పసుపు, పచ్చిమిర్చి మరియు అల్లం వేసి, నెయ్యిలో కొద్దిసేపు వేయించుకోవాలి.
  4. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న వెజిటేబుల్ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేగించుకోవాలి.
  5. వెజిటేబుల్స్ పూర్తిగా వేగిన తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకొన్న బియ్యం మరియు పప్పు మరియు ఉప్పు కూడా వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
  6. మిక్స్ చేసి రెండు నిముషాలు, మీడియం మంట మీద వేయించిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు(3కప్పుల)నీటిని పోసి, కుక్కర్ మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్ లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి మరోసారి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి సర్వ్ చేయాలి. దీనికి రైతా బెస్ట్ కాంబినేషన్.