వేసవికాలంలో మజ్జిగ త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు..!

ఈ ఏడాది ఎండలు అంతకుఅంత మండిపోతున్న‌వి. దీంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో బ‌య‌ట‌కు రావాలంటేనే ప్రతిఒక్కరు జంకుతున్నారు. ఎంతటి ప‌ని ఉన్నా ఉద‌యమో లేదా సాయంత్ర‌మో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు త‌ప్ప మ‌ధ్యాహ్నం కాలు బ‌య‌ట పెట్ట‌డం లేదు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతకు మధ్యాన్నంసమయంలోబయటకు రావటానికి జనాలు సాహసించటంలేదు.

ఈ పరిస్థితుల్లో వేస‌వి తాపం నుంచి సేద‌దీరేందుకు రకరకాల చ‌ల్ల‌ని మార్గాల‌ను కూడా అనుస‌రిస్తున్నారు. అయితే ఇంతటి వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే అనేక పానీయాల్లో మ‌జ్జిగకు ప్రత్యేకంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌జ్జిగ‌ను వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా తాగటంవలన మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం..!

1. వేస‌వికాలంలో చ‌ల్లని మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల మన శ‌రీరం చ‌ల్ల‌బ‌డంతోపాటు వేస‌వి తాపం నుంచి కూడా ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు ఇంటికి చేరుకోగానే కాస్త చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ రసాన్ని కలిపి తాగడంవల్ల ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎలా చేయడంతో వేస‌వి తాపం తీరుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండటమే కాకుండా శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తూకంలో ఉంటాయి.

2. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయి త‌గ్గుతుంది అని చెబుతున్నారు. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి అని నిపుణులుచెబుతున్నారు. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ మోతాదు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3. కాల్షియం లోపం ఉన్న‌వారు మ‌జ్జిగ‌ను సేవించడం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి అని నిపుణులు వెల్లడించారు.

4. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల మన శరీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు పడటంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి అని వైద్యులు చెబుతున్నారు. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంధని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *