బ్రేక్‌ఫాస్ట్‌ తినకుంటే ఇన్ని అనారోగ్య సమస్యలా.?

ప్రస్తుతం బిజీ జీవితంలో పడి  కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ని తినరు. మన రోజూ వారి ఆహారంలో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనది, రోజువారి బ్రేక్ ఫాస్ట్ తినకపోతే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనని అంటున్నారు వైద్య నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌ చేయని వారిలో జీవక్రియ దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడికి లోనవుతారని, అలాగే పొట్టలో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. బ్రేక్‌ఫాస్ట్‌ తినే వారితో పోలిస్తే బ్రేక్‌ఫాస్ట్‌ తినని వారిలో హైపర్‌టెన్షన్‌ ఉంటుంది. ఉదయాన్నే అల్పాహారం ఆరగించకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని ఓ సర్వేలో తేలింది. హార్వర్డ్‌ యూనివర్శిటీ వారు 46,289 మందిని తీసుకుని ఓ పరిశోధన చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌ను తినని వారు టైప్‌-2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదముందని ఆ పరిశోధనలో తేల్చారు.

మనం బ్రేక్‌ఫాస్ట్‌ తినటం మానేస్తే బరువు తగ్గిపోతామని చాలామంది అపోహ పడుతుంటారు, ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ తినకుండా ఉంటే ఇంకా బరువు పెరుగుతారని బరువు పెరుగుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తింటూ, తగిన వ్యాయామాలు చేస్తే ఎంలాటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా బరువు తగ్గొచ్చు.

ఉదయాన్పే అల్పాహారం తినకుంటే ఎనర్జీ లెవల్స్‌ తగ్గిపోతాయి. బ్రేక్‌ఫాస్ట్‌కు దూరంగా ఉండటం వల్ల వెంట్రుకల్లోని కెరోటిన్‌లో సమస్యలు తలెత్తి జుట్టు రాలుతుంది. దీంతో పాటు శరీరంపై దుష్ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. తలనొప్పి వస్తుంది, ముఖ్యంగా మైగ్రేన్‌ నొప్పులు పట్టి పీడిస్తాయి.

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల కలిగే సమస్యలు :

ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి
గుండె సంబంధిత సమస్యలు
క్యాన్సర్ సమస్యలు
డయాబెటిస్ సమస్యలు
తలనొప్పి
జుట్టు రాలడం
బరువు పెరగటం
జీర్ణక్రియ సమస్యలు

సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనుకున్న వారు బ్రేక్ ఫాస్ట్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.