మళ్ళీ తెరపైకి పవన్ కళ్యాణ్, సినిమా చేయబోతున్నారా ?

ఎన్నికల హడావిడి తగ్గకముందే తెరపైకి మరో వార్త హల్చల్ చేస్తోంది , ఎన్నికల ఫలితాలకు ఇంకా నెల టైం ఉన్న నేపథ్యంలో ఇంకో వార్త తెర పైకి వచ్చింది పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పొలిటీషన్ గా తన జీవితం సాగిస్తాను అని ఒక సందర్బంగా చెప్పారు దాంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయిన ఆయన ఫాన్స్ లో కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మెచ్చుకున్నారు ,

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరో సినిమాలో నటించబోతున్నారు అనే వార్త బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడే వ్యక్తి ని అందరికి తెలుసు, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి అంటే కచ్చితంగా నటించాల్సిందే , ఎందుకు అంటే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు పవన్. తీసుకున్నఅడ్వాన్స్‌ను నిర్మాతలు తీసుకోకుండా ఎన్నికల తరువాత సినిమా చేసి పెట్టమన్నారు. ఈ లెక్కన పవన్ నటించే సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ఎస్ఆర్‌టి బ్యానర్స్‌లో నటిస్తానని మాట ఇచ్చాడట పవన్.

పవన్ కళ్యాణ్ గారికి స్నేహితుడు అయిన రామ్ ఎస్ ర్ టీ బ్యానర్ లో వచ్చిన నెలటికెట్ సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ సమయం లో సినిమా చేద్దామని రామ్ కి మాట ఇచ్చారు అంట పవన్ కళ్యాణ్ గారు, అయితే సినిమాలలో నటించెది లేనిది పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సి ఉంది !

సినిమా చేసేది లేనిది వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుంది అని తెలుస్తుంది !

  • 4
    Shares