మార్నింగ్ వాక్‌తో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలో?

Benefits of Morning Walks for Health, Benefits of Walking, Health Benefits Of A Morning Walk, mMorning walk benefits in telugu, Walking benefits in telugu, Manatelugunela, Walking uses in telugu, Running benefits, Weight loss tips in telugu, Weight loss foods, Benefits of running,20వ దశాబ్దంలొ ఆధునిక ప్రపంచం సరికొత్త పుంతలు తొక్కుతోంది. చేతిలో ఒక స్మార్ట్ఫోన్ వుంటే చలు అన్ని సౌకర్యాలు డోర్ డెలివరీలు చేయించుకునే సౌలభ్యం అందుబాటులో వచ్చింది. ఈ బిజీ బిజీ జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వాళ్లు తక్కువనే అని చెప్పాలి. కనీసం తినడానికి కూడా సమయం దొరకనంత బిజీగా తమ ఉద్యోగాల్లో నిమగ్నమై ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల మన శరీరం అలసటకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితిని దరిచేరనీయకుండా ఉండాలంటే రోజుకి కనీసం 20 నిమిషాల పాటు నడిస్తే శరీరానికి చాలా మంచిదని వైద్య నిపుణులు వెల్లడించారు.

మన దినచర్యలో బాగంగా నడకని చేర్చడం వల్ల అన్ని రకాల రోగాలు దూరం అవుతాయి. రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులకు అడ్డుకట్ట వేయవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది.

తెల్లవారు జామున సూర్యుడి నుంచి వచ్చే సూర్యా కిరణాలు మనిషిపై పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. మన శరీరభాగంలో ఉన్న అధిక కొవ్వును కరిగించి, బరువు తగ్గించేందుకు నడక దోహదపడుతోంది. మన దినచర్యలో భాగంగా క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిరంతరం వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వాకింగ్ చేయడాన్ని బాల్యం నుండే అలవాటుగా మార్చుకోవడం మంచిదని సూచించారు. ప్రతిరోజూ కనీసం 20-30 ని”లు వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉత్సహంగా ఉంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యోగ రీత్యా కలిగే మానసిక ఒత్తడిని కూడా వాకింగ్ చేయడం వల్ల నియంత్రింవచ్చునని మానసిక వైద్యులు వెల్లడించారు.