గర్భిణీలు కాళ్ళవాపులు తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Leg Cramps During Pregnancy,  Common Leg Problems During Pregnancy ,  Leg swelling during pregnancy home remedies,  lLeg pains in pregnancy,  Heath tips in Telugu,  Telugu health Tips,  Pregnancy problems telugu,  pPregnancy diet chart in telugu,  Pregnancy caring tips,  Manatelugunela,  సాధారణంగా మనం గమనించినతాయితే 75 శాతం మంది గర్భిణీ స్త్రీలకు 7వ మాసం వచ్చేవరకి వారికి పాదాలు, కాళ్లకు వాపులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉద్యోగం చేసే గర్భిణీస్త్రీలు పగటిపూట విశ్రాంతి లేకుండా ఎక్కువ సమయంలో బయటనే గడుపడం వల్ల, కాళ్ల కిందకు వేళ్ళాడేసి సరిపడినంత విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి కళ్ళవాపులు రావడం మామూలే, అయితే అటువంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాళ్ళవాపులు, పాదాల వాపుల బాధల నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చునని పరిశోధకులుచెబుతున్నారు.

ప్రతి రోజు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగాలి. అధికంగా నీళ్లు తాగటం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. వ్యర్థాలు బయటకు రావడం వల్ల అప్పడు వాపులు పెరగే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులుచెబుతున్నారు. కాళ్ళకు సాక్సులు వేసుకునేవారు టైట్ గా వుండే, ఎలాస్టిక్ కలిగిన సాక్సులను వేసుకోకూడదు ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరగదు.

కొంతమంది మహిళలని గమనిస్తే వాపులు కాళ్ళు, పాదాలకు మాత్రమే పరిమితం కాకుండా చేతులు, మొహం కూడా వాచి లావుగా అవుతాయి. అలా ఉన్నపుడు బాగా విశ్రాంతి తీసుకోవాలి. చాలా గంటలు విశ్రాంతి తీసుకున్నా అలాగే వుంటే చాలా ప్రమాదం, అటువంటింవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *