మిమ్మల్ని ఆశ్చర్య పరిచే నిమ్మకాయ ఉపయోగాలు.!

నిమ్మకాయ మనకి ఎప్పుడుఅందుబాటులో ఉంటుంది నిమ్మకాయ వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
నిమ్మకాయ పిండిన నీటిలో ఉంచితే చేతులు మృదువుగా అవుతాయి.
అలాగే మందార ఆకు రసంలో నిమ్మరసం వేసి కలిపి జుట్టుకి పట్టించి గంట సేపు ఆరనిచ్చి తలస్నానం చేస్తే జుట్టు సంపద బాగా వృద్ధి చెందుతుంది.
నిమ్మరసాన్ని పాలు కలిపి పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి ఉదయాన్నే వేడి నీటిలో కడిగితే మొఖం కాంతివంతముగా అవుతుంది.
మందార ఆకుల రసాన్ని నిమ్మరసాన్ని కలిపి రాసుకుంటే చర్మ వ్యాధులు దూరం అవుతాయి.
శరీరంలో దురదలుఉన్నచోట నిమ్మరసాన్ని గసగసాలు కలిపి రాస్తే దురదలు మాయం అవుతాయి.
నిమ్మరసం తలకి మర్దన చేసుకుని జుట్టుకి రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది.
చేపలు తింటున్నప్పుడు చేప ముళ్ళు గొంతు కి అడ్డు పడితే నిమ్మరసాన్ని కొద్దికొద్దిగా తాగితే ముల్లు అడ్డు పోతుంది.
కామెర్లు వచ్చినప్పుడు 30 గ్రాముల నిమ్మరసాన్ని నీటిలో కలిపి తీసుకుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గుతుంది.
అధిక బరువు ఉన్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో లో తేనె మరియు నిమ్మరసాన్ని తీసుకోవడం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
అందుకే మన రోజువారీ నిమ్మకాయ రసం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్యమైన ప్రయోజనాలు పొందవచ్చు.