తాగేముందు పాలను ఎందుకు వేడిచేయాలి?

Health Benefits of Milk, Health Benefits of Boiling Milk, Benefits of Warm Milk, Milk Nutrition Facts, Manatelugunela, What are the benefits of Milk, Health Benefits of Drinking Warm Milk, Health Benefits of Warm Milk, Health Tips in Telugu, Telugu Health Tips,

మనందరికీ సంపూర్ణ పోషణను అందించే ఆహారాలలో పాలకే మొదటి స్థానం దక్కుతుంది. శరీరానికి బలంతోపాటు, కాల్షియం కూడా పుష్కలంగా దక్కాలంటే ప్రతిరోజూ పాలను తాగాలి. పాలు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయి. కానీ పాలను తాగడానికి ముందు వాటిని బాగా మరిగించాలి. అలా మరిగించటం వల్ల దానిలోని హానికరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. కానీ, ప్యాకెట్లలో లభించే పాలను మారగించాల్సిన అవసరం లేదంటు నిపుణులు చెబుతున్నారు.

నూటికి 90% మంది ప్యాకెట్ పాలను కూడా బాగా మరిగించి తాగుతారు. అలచేయటం వల్ల పాలలోని పోషక విలువలు తగ్గిపోతాయి. ప్యాకెట్ పాలను కొద్దిగా వేడి చేసి తాగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్యాకెట్ పాలను ఎందుకు మరిగించకూడదో తెలుసుకుందాం. సాధారణంగా డైరీ వాళ్లు పాలను 161.6° డిగ్రీల ఫారెన్‌హీట్ టెంపరేచర్‌కు మరిగించిన 15 సెకన్లలో చల్లారుస్తారు. అలచేయటం వల్ల హానికారకమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియా తొలగిపోతుంది.

ఈ ప్రక్రియను పాశ్చరైజేషన్ ( Pasteurization )అంటారు. పాశ్చరైజేషన్ చేసిన పాలను మరోసారి మరిగించాల్సిన అవసరం లేదు. కానీ చల్లగా త్రాగడం ఇష్టంలేని వారు కాస్త గోరువెచ్చగా వేడి చేసుకుని తీసుకోవచ్చు. ఇక మార్కెట్లో లభించే ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాలను కొనుగోలు చేసినవారు మాత్రం ఆ పాలను ఖచ్చితంగా మరిగించాలి. అలా మరిగించటం వల్లనే సాల్మొనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత పాలను నిరభ్యంతరంగా ఉపాయోగించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *