మన్మథుడు 2లో బ్రహ్మానందం, సునీల్ ఉన్నటా లేన్నట్ట ?

Nagarjuna's Manmadhudu 2 Movie, 'Manmadhudu 2 sequel, 'Manmadhudu 2 Movie, Manmadhudu 2 Movie Trailer, Nagarjuna Manmadhudu 2 Update, Nagarjuna Manmadhudu 2 Release Date, Manmadhudu 2 Cast and crew, మన్మధుడు 2, Rakul Preet Singh and Nagarjuna,

మన్మథుడు సినిమా తరువాత నాగార్జున నిక్ నేమ్ గా టైటిల్ సెట్టయిన సంగతి మనకి తెలిసిందే. అంతగా అభిమానులకు దగ్గరైన నాగార్జున అదే సీక్వల్ తో మరోసారి రెడీ అవుతుండడంతో సినిమాలో రొమాన్స్ తో పాటు పంచ్ లపై కూడా భారీ అంచనాలు పెరిగుంటాయని స్పెషల్ గా ప్రతేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన చిత్ర యూనిట్ అభిమానులని బాగానే ఎట్రాక్ట్ చేసింది.

నాగ్ సరసన అప్పుడు కథనాయకిగా సోనాలి బిద్రె నటించగా ఇప్పుడు ఆ స్థానాన్నికి రకుల్ సిద్ధమైంది. అస్లు విషయానికి వస్తే మన్మథుడు సినిమాలో రెండు కామెడీ పాత్రలు ఇచ్చే కిక్ అంత ఇంత కాదు. ఒకటి సునీల్ బంక్ శ్రీను క్యారెక్టర్ – ఇంకోటి బ్రహ్మానందం లవంగం సూరిబాబు క్యారెక్టర్. ఈ రెండు పాత్రల వల్ల సినిమాకు మంచి బూస్ట్ వచ్చిందిఅని మీకు చెప్పనవసరం లేదు.

త్రివిక్రమ్ రాసిన అద్భుతమైన డైలాగ్స్ – డైరెక్టర్ కె.విజయ్ భాస్కర్ టేకింగ్.. సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు మరియు అభిమానులకు కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక ఇప్పుడు మన యువ దర్శకుడు రాహుల్ రవిచంద్రన్ ఒక్కడే అంతటి బారి పాత్రలను మళ్ళీ కంటిన్యూ చేయగలడా? చేసినా ఆ స్థాయిలో మ్యానేజ్ చేయగలడా అనే అంచనాలు అందరిలో ఉన్నాయి. సునీల్ – బ్రహ్మానందం ఇప్పటికి ఆ పాత్రల్లో కొనసాగడానికి రెడీగా ఉన్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించారు. మరి చిత్ర యూనిట్ ఎంటర్టైన్మెంట్ లో ఎలాంటి కిక్ ఇస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *