బ్రహ్మీ, సునీల్ ఆ హాట్ బ్యూటీ కి ఎందుకు భయపడుతున్నారు.!

ఒకప్పుడు టాలీవుడ్ లో హర్రర్ కామెడీ చిత్రాలు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే,  ప్రస్తుతం బాలీవుడ్ లో హారర్ కామెడీ ల ట్రెండ్ బాగానే నడుస్తుంది.ఇప్పటికే పలు హారర్ కామెడీ సినిమాలు విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ట్రెండు ఎంతలా ఉందంటే అక్షయ్ కుమార్ కాంచన సినిమా తో ప్రేక్షకులను భయపెట్టనున్ననాడు. ఇప్పుడు ‘కొక కోలా’ అనే మరో హారర్ కామెడీ చిత్రం రానుంది, ఈ చిత్రం లో టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయినటువంటి బ్రహ్మానందం మరియు సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రంతో ఇద్దరూ కమెడియన్స్  బాలీవుడ్లో అడుగు పెట్టనున్నారు.

ఇదివరకు తన అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హాట్ బ్యూటీ సన్నీలియోన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ దెయ్యం క్యారెక్టర్ చేస్తూ, సునీల్ మరియు బ్రహ్మానందం లకు భయం పుట్టించనుంది. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ప్రసాద్ తాటినేనిదర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు సన్నీ లియోన్ మందన కరిమి ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.

ఈ చిత్రాన్ని మహేందర్ దరివాల్ మరియు పరందీప్ సందు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ హర్రర్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది. ఈ సినిమా హిందీ లో మాత్రమే కాక తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలవుతుంది.  తెలుగులో స్టార్ కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం, సునీల్ హిందీలో స్టార్ కమెడియన్స్ అనిపించుకుంటారు లేదో వేచి చూడాల్సిందే.