క్రికెటర్ ప్రేమలో అనుపమ పరమేశ్వరన్ ప్రూఫ్ కూడా దొరికేసింది..!

దక్షిణాదిలో అనుపమ పరమేశ్వరన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ మరియు క్రేజీ క్రికెటర్ బుమ్రా  మధ్య ప్రేమ వ్యహారం కొనసాగుతోంది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక షాకింగ్ కధనం ప్రచురించడంతో వీరిద్దరి మధ్య ఏమి జరుగుతోంది ? అనుపమ, బుమ్రా మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని సోషల్ మీడియాలో అనే వార్త  చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి బయట కనిపించక పోయినా ఇలాంటి గాసిప్స్ ఎందుకు వచ్చాయి అన్నది ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఈ వార్త రావడానికి కారణం కూడా లేకపోలేదు అది ఏమిటంటే సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకర్నొకరు ఫాలో అవుతున్నారు. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక సినిమా నటి అనుపమ మాత్రమే అంతేకాదు ఒకరు పెట్టే పోస్ట్‌కు ఒకరు షేర్ చేయడం, లైక్‌లు కొట్టడం తరచుగా చేస్తున్నారట.

ఈ వార్తలు వైరల్ అవడంతో వెంటనే అప్రమత్తమైన అనుపమ, క్రికెటర్ బుమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే మీడియా గాసిప్పులకు చాల దూరంగా ఉండే అనుపమా ఇప్పుడు నిజంగానే బుమ్రా ప్రేమలో పడిందా అయినా నిప్పు లేనిదే పొగ రాదు అంటున్నారు నెటిజన్స్.