రాయలసీమ లో 60ఏళ్ళ రాజకీయ నాయకుడు 14 ఏళ్ళ అమ్మాయి ని తల్లిని చేసాడు..

14ఏళ్ల బాలిక‌ను నెల‌ల త‌ర‌బ‌డి అత్యాచారం చేస్తూ.. గ‌ర్భ‌వంతురాలిని చేసి.. ఆమె శీలంకు వెల‌గ‌ట్టి.. ఆచిన్నారి క‌డుపులో పెరుగుతున్న బిడ్డ‌ను తొల‌గించే క్ర‌మంలో వెలుగులోనికి వ‌చ్చిన ఓ రాజ‌కీయ పార్టీకి చెందిన కామాంధుడు అరెస్ట్‌లో పోలీసులు పెద్ద డ్రామానే న‌డిపారు.. ఆ కామాంధుడికి రాచ‌మ‌ర్యాద‌లు చేసి.. చివ‌ర‌కు మీడియా కంట ప‌డ‌కుండా కోర్డుకు హాజ‌రు పెట్ట‌డంలో పోలీసు అధికారులు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.. చాపాడు మండ‌ల పోలీసుస్టేష‌న్‌లో చోటుచేసుకుంది.

చాపాడు మండలం చీపాడుకు చెందిన ఓ రాజ‌కీయ పార్టీకి చెందిన బ‌డా నాయ‌కుడు శ్రీయ‌పురెడ్డి వీర‌రాఘ‌వ‌రెడ్డి వ‌య‌స్సు 60 ఏళ్లు.. ఆవ‌య‌స్సులోనూ ఆ నాయ‌కుడు కామంతో క‌ళ్లు మూసుకుపోయాడు.. త‌మ ఇంట్లో ప‌నిచేస్తున్న 14ఏళ్ల ర‌జ‌క కులానికి చెందిన మైన‌ర్ బాలిక సుప్ర‌జ‌పై అత్యాచారం కొన‌సాగించేవాడు.. చివ‌ర‌కు ఆ బాలిక నెల‌త‌ప్పింది.. ఆ నాయ‌కుడి కామ‌వాంఛ ఫ‌లితంగా ఆ బాలిక క‌డ‌పులో మోసు కాచింది.. ఆమోసుకు వ‌య‌స్సు ఆరు నెల‌లు.. పెద్ధాయ‌న‌గా పిలువ‌బ‌డుతున్న రాఘ‌వ‌రెడ్డి త‌న బిడ్డ‌కు క‌డుపు చేయ‌డంపై సుప్ర‌జ త‌ల్లిదండ్రులు నిల‌ధీశారు.. త‌మ ధ‌న‌, అంగ‌బ‌లంతో చివ‌ర‌కు ఆబాలిక శీలంకు వెల‌గ‌ట్టాడు.. బాలిక క‌డ‌పులో పెరుగుతున్న బిడ్డ‌ను చంపేంసేందుకుఈనెల 6న మైదుకూరు ఆస్ప‌త్రిలో చేర్పించాడు.. మైదుకూరు ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో బాలిక‌కు గ‌ర్శ‌సావ్రం చేయించే క్ర‌మంలో కామాంధుడు రాఘువ‌రెడ్డి వ్య‌వ‌హారం వెలుగు చూసింది..

దీంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.. పెద్ద మ‌నిషిగా.. రాజ‌కీయ నాయ‌కుడిగా చెలామ‌ణి అవుతున్న రాఘ‌వ‌రెడ్డి అరెస్ట్ విష‌యంలో పోలీసులు మెత‌క వైఖ‌రి అవలంభించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.. బాలిక‌పై అత్యాచారం చేసి గ‌ర్భ‌వ‌తిని చేసిన నిందితుడురాఘ‌వ‌రెడ్డిని అరెస్ట్ చేసి వీరి అమానుష చ‌ర్య గురించి స‌మాజంకు తెలియజేయాల్సిన పోలీసు అధికారులు.. చివ‌ర‌కు ఆ నిందుతుడి అరెస్ట్‌లో పెద్ద డ్రామానే న‌డిచింది.. మీడియాకు కంట ప‌డ‌కుండా కోర్టుకు త‌రిలించే విష‌యంలో పోలీసులు నానా హంగామా చేశారు.. పోలీసుల తీరు చూసిన జ‌నం విస్తుపోయారు.. శనివారం మధ్యాహ్నం రెండు గంట‌ల ప్రాంతంలో స్టేష‌న్‌లో ద‌ర్జాగా కుర్చీలో పోలీసులు నిందితుడైన రాఘ‌వ‌రెడ్డిని కూర్చోబెట్ట‌డం క‌న్పించింది.. ఆ త‌ర్వాత నిందితుడి మోహం క‌న్పించకుండా ట‌వ‌ల్ క‌ట్టారు.. పోలీసు స్టేష‌న్ ఎదుట ప్ర‌యివేట్ కారును ఏర్పాటు చేశారు.. ఆకారులోకి పోలీసుల తీసుకువెళ్లే క్ర‌మంలో ప‌రుగులే ప‌రుగులే.. ఎక్క‌డ మీడియా వాళ్లు షూట్ చేస్తార‌నో భ‌యం పోలీసుల్లో కొట్టొచ్చిన‌ట్లు క‌న్పించింది.. కారులోకి తీసుకెళ్లాక మీడియా చుట్టుకోవ‌డంతో తిరిగి పోలీసుస్టేష‌న్‌కు నిందితుడిని తీసుకువచ్చారు.. మ‌ళ్లీ స్కూట‌ర్ మీద కోర్టుకు తీసుకెళ్ల‌డంలో పోలీసులు మ‌ళ్లీ నానా యాగీ చేశారు.

కామాంధుడి విష‌యంలో పోలీసులు చేసిన యాగిని చూసిన మీడియా జ‌ర్న‌లిస్టులు.. ఇత‌రులు ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి. నిందితుడి రాఘ‌వ‌రెడ్డి విష‌యంలో పోలీసు అధికారులు ఎందుకు అలా ప్ర‌వ‌ర్తించార‌న్న‌ది అంద‌రిలో నెల‌కొన్న శేష ప్ర‌శ్న. త‌న కూతురిపై అఘాయిత్యం చేసిన ఆ వ్య‌క్తికి పోలీసులు రాచ‌మ‌ర్యాద‌లు చేసిన తీరు చూస్తే నాకు, నాకూతురికి న్యాయం జ‌రగ‌ద‌ని అన్పిస్తోంద‌ని బాలిక తండ్రి సుబ్బ‌రాయుడు వాపోయాడు ర‌జ‌.క కులానికి చెందిన బాలిక‌ను ప‌నికోసం వారింటికి పంపితే చివ‌ర‌కు బాలిక‌ను చెడిపేశాడు.. ఆవయ‌స్సులో కూడా కామంతో క‌ళ్లు మూసుకుపోయి గ‌ర్భ‌వ‌తిని చేశాడ‌ని ఆగ్రామానికి చెందిన స్ధానికుడు ఉద‌య‌కుమార్ అంటున్నాడు. మైన‌ర్ బాలిక వ్య‌వ‌హారం కాబ‌ట్టి పై అధికారుల మేర‌కు నిందితుడు రాఘ‌వ‌రెడ్డిని మీడియా ముందు ప్ర‌వేశ పెట్ట‌లేద‌ని సీఐ స‌త్య‌నారాయ‌ణ చెప్పుకొచ్చారు.

రాయలసీమ లో 60ఏళ్ళ రాజకీయ నాయకుడు 14 ఏళ్ళ అమ్మాయి ని తల్లిని చేసాడు.. వీడిని ఏమి చేయాలో కామెంట్స్ చేయండి..

Posted by Mana Telugu Nela – MTN on Tuesday, June 11, 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *