వినయ విధేయ రామ ప్లాప్ కి కారణాలు ఇవే!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,మాస్ డైరెక్టర్ బోయ పాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ ఆరెంజ్ , తుఫాన్ సినిమాల సరసన చేరింది. మాస్ డైరెక్టర్ , మాస్ హీరో కాబట్టి సహజంగానే ఈసినిమాపై అంచనాలు ఎక్కువ ఉండడం వలన డిస్ట్రిబ్యూటర్లు వివిఆర్ సినిమాని ఎక్కువ మొత్తం లో కొన్నారు. కానీ బోయపాటి ఫైట్ ల కోసం కథను రాసుకోవడం తో సినిమాకు దశ దిశా అంటూ లేకపోయింది. పాము తో కరిపించుకొనే సీన్ , ట్రైన్ సీన్ లతో బోయపాటి ప్రేక్షకులకు విసుగుతెప్పించాడు. సినిమాలో రామ్ చరణ్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన బోయపాటి ఓవర్ యాక్షన్ తో కెరీర్ లో మరో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు చరణ్.
అయితే ఓ రేంజ్ లో డిజాస్టర్ టాక్ వచ్చిన కూడా 60 కోట్ల షేర్ ను రాబట్టి తన సత్తా ఏంటో చూపెట్టాడు చరణ్. ప్లాప్ టాక్ వస్తేనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టిన ఈచిత్రం కనీసం యావరేజ్ టాక్ వచ్చిన రంగస్థలం రికార్డు ను బ్రేక్ చేసేదే. అయితే సినీమా విషయంలో చరణ్ తప్పులేకపోయిన బోయపాటి ను అంత గుడ్డిగా ఎలా నమ్మాడు అనేదే మెగా అభిమానులకు అర్ధం కావడం లేదు.

బోయపాటి నువ్వు బాబు రెడి బాబు, యాక్షన్ అని అనడం మానేసి సినిమాలో స్టార్ క్యాస్ట్ తగ్గించి కథ, డైరెక్షన్ పైన శ్రద్ద పెడితే బాగుంటుంది.