పి.టి ఉష బయోపిక్‌ లో నటించనున్న బాలక్రిష్ణ హీరోయిన్..!

PT Usha biopic, PT Usha life story, biopic on PT Usha, Katrina Kaife as PT Usha, Katrina Kaif to play PT Usha , Katrina Kaif in PT Usha biopic, Katrina Kaif  in  PT Usha biopic?, Mana Telugu Nela, Manatelugunela,

భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉష జీవితాధారంగా బయోపిక్‌ రాబోతోంది. పి.టి. ఉషా తన సాధించిన విజయాలతో భారతదేశం గర్వపడేలా చేసింది. పి.టి.ఉష జీవితకథతో బయోపిక్ తెరకెక్కించేందుకు సీనియర్ నటి- దర్శకురాలు రేవతి సీరియస్ గా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఇందులో నటించమని ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా ని సంప్రదించారు కానీ ప్రియాంక పెళ్లి చేసుకుని కాస్తా బిజీ అవ్వడం వలన పి.టి.ఉష బయోపిక్‌లో నటించే అవకాశం కత్రిన కైఫ్ కి దక్కింది.

పి.టి.ఉష  1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు, ఒక రజిత పతకం సాధించింది. పి.టి.ఉష  గురించి ఇండియాతో పాటు దేశ విదేశాల్లో ప్రముఖంగా చర్చిస్తారు. కావున ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ని చైనా రష్యా సహా ఇతరచోట్ల రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది కాబట్టి డైరెక్టర్ రేవతి ప్రయత్నంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. కత్రినా ఈ బయోపిక్ కోసం కఠినమైన శిక్షణా సెషన్లలో పాల్గొంటుంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్టుకు తెరకెక్కించనున్నారని ఫిల్మ్ వర్గాల టాక్ ఆస్కార్ గ్రహీత .. స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ని సంగీత దర్శకుడిగానూ ఎంపిక చేసుకోవడం ఆసక్తిని పెంచుతోంది.