బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మరో తెలుగు సూపర్ హిట్ చిత్రం

తెలుగులో సూపర్ హిట్ విజయం అందుకున్న చిత్రం ‘కాంచన’ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌గా త్వరలోనే మన ముందు కి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు రాఘవ లారెన్స్ . ఈ సినిమాతో అయన బాలీవుడ్‌కు దర్శకుడు గా పరిచయం కాబోతున్నారు. ఇంతకు ముందు డాన్స్ మాస్టర్ ప్రభుదేవా కుడా దర్శకుడిగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు, ఈ చిత్రం లో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అక్షయ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తున్నారు.

అలాగే ‘కాంచన’ మూవీ లో కన్నడ నటుడు శరత్‌కుమార్‌ హిజ్రా పాత్రలో నటించి మెపించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు లక్ష్మి బాంబు లో అమితాబ్‌ బచ్చన్‌ హిజ్రా పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నారు అనే వార్త వైరల్ అవుతుంది.అయితే ఇంకా దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో మాధవన్‌ కుడా కీలక పాత్ర పోషిస్తున్నాడు అలాగే మరో హీరోయిన్ శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రలు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *