ప్రచారంలో పచ్చనొట్ల.. హంగామా… రోజుకు ఎంత ఇస్తున్నారు అంటే?

ఓటుకు నోటేకాదు… ప్రచారానికి పచ్చానొట్లను పంచుతున్నారు. అధికారులు ఉన్నా లేకున్నా మా పని మాదే అన్నట్లుగా ఉంది రాజకీయ నాయకుల వ్యవహారం. రోడ్డు షో లో పాల్గొన్న మనిషికి రెండొందలు చొప్పున పంపిణీ చేసిన ఘనత భవనగిరి జిల్లాలోని నాంపల్లిలో చోటు చేసుకుంది.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకియ నాయకులు ప్రజల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓటర్లుకు డబ్బు ,మందు, బహుమతులు అశ చూపించి తమ వైపుకు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. పైసలిచ్చి మరి ప్రచారానికి హాజరయ్యేలా చూస్తున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా 41 కోట్లకు పైగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ అక్రమ మార్గాల్లో డబ్బు పంపిణీ మాత్రం ఆగడం లేదు.

ఈ విషయం భువనగిరి జిల్లా నాంపల్లి లో మండల కేంద్రము లో తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రోడ్డు షో నిర్వహించారు. ఈ ప్రచారంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారికి డబ్బులు పంచడం ఈటీవీ భారత్ కంటపడింది. ఒక్కోమనిషికి రెండొందల చొప్పున పంచారు. అయితే ముందు చెప్పిన విధంగా కాకుండా తక్కువ డబ్బులు ఇచ్చారని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.

  • 5
    Shares