రివ్యూ : మహర్షి (మహేష్ బాబు)

నటీనటులు: మహేశ్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేశ్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, ప్రకాశ్ రాజ్, జయసుధ తదితరులు.
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: కేయూ మోహనన

సామాజిక అంశాలతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమా చేసాడు అవి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచి సూపర్ స్టార్ మహేష్ బాబుకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. దీంతో తన కెరీర్లో 25వ చిత్రానికి అదే ఫార్మాట్ లో ఓ పాయింట్ ఎంచుకొని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రమే మహర్షి తన గత చిత్రాల తరహాలో మహేష్ కి హిట్ అందించిందో లేదో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లసిందే..

కథ :

కథ విషయానికి వస్తే రిషి కుమార్ ఓడిపోవడం అంటే ఏమిటో తెలియదు, తన కష్టాలని, కళ లను విజయానికి సోపానాలు గా మార్చుకునే నేపధ్యం అతనిది. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే తన విజయం ద్వారా వచ్చిన ప్రతి ఫలాలు తన ఒక్కడి వలనే కాదని వాటి వెనుక తన ఇద్దరి స్నేహితుల హస్తం కూడా ఉందని తెలుసుకుంటాడు. మరి తన స్నేహితుల కోసం ఏం చేశాడు, విజయం అంటే ఏమని తెలుసుకున్నాడు. రిషి మనిషి నుండి మహర్షి గా ఎలా మారాడు అనేదే ప్రధాన కథ.

విశ్లేషణ :

మహర్షి మహేష్ కి 25వ సినిమా కావడంతో ఓ మంచి కథను ఎంచుకుని దానిని కమర్షియల్ చూపించాలనే దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తూనే CEO గా రిషిని పరిచయం చేసే సన్నివేశాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఆ వెంటనే ప్లాష్ బ్యాక్ మొదలవడం కూడా ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తాయి. ఒక CEO గా విద్యార్థిగా అప్పటికప్పుడు తన పాత్రలో రెండు వేరియేషన్స్ చూపించాడు మహేష్ కాలేజ్ సన్నివేశాలు సరదాగా సాగిపోతూ ఆ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్నేహం ప్రేమ లాంటి ఎమోషన్స్ పండిస్తూనే విద్యా వ్యవస్థ తీరును ప్రశ్నించే ప్రయత్నం కూడా చేశారు. కాలేజ్ నేపథ్యం ముగ్గురి మధ్యా స్నేహం, విద్యా వ్యవ్థను వ్యంగ బాణాలు ఇవన్ని చూస్తే గతంలో వచ్చిన విజయవంతమైన చిత్రలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా విశ్రాంతికి ముందు సన్నివేశాల్లో ఎమోషన్స్ తో ఆకట్టు కుంటాయి, తొలి సగంలో విద్య వ్యవస్థ ను ప్రశ్నించిన రిషి ద్వితీయార్థంలో రైతు సమస్యలపై పోరాటం చేస్తాడు.

రిషి లక్ష్యం ఆశయసాధనకు ఎంచుకున్న మార్గం ప్రేక్షకుని ఆలోచనలో పడేస్తాయి కమర్షియల్ సినిమాలో ఇలాంటి పాయింట్ చెప్పడానికి ప్రయత్నించడం గొప్ప విషయమే. అయితే ఓకే అంశంతో ద్వితీయార్థం మొత్తం నడిపించడం తో కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.

కథలో కీలకం అని చెప్పుకున్న మహేష్, నరేష్ ఎపిసోడ్స్ బాగానే పండిన ఇంకా అవకాశం ఉంది. పతాక సన్నివేశాల వరకు ఎలాంటి మలుపులు లేకుండా సాగడం క్లైమాక్స్ కూడా రోటీన్ గా ఉన్న ఎంచుకున్న కథను అలాగే తెరపైన చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఇంకా నటి నటుల విషయంలో కి వస్తే మహేష్ క్కో… గా క్లాస్ గా కనిపిస్తే, విద్యార్థి గా మాస్ నీ అలరిస్తాడు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నపుడు మరో కోణంలో కనిపిస్తాడు. అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రలో కథకి మూలస్తంభంగా నిలిచాడు. హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో మంచి పాత్ర దక్కింది, జగపతిబాబు మరోసారి స్టైలిష్ విలన్ గా బాగా అకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, జయసుధ తమదైన శైలిలో అల్లుకు పోయారు, మిగతా నటీనటులు కూడా పరదిమెరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్ :

మహేష్ కామెడీ టైమింగ్ మరియు నటన

మహేష్ మరియు నరేష్ మద్య సన్నివేశాలు

రెండు మాంటేజ్ పాటలు చాలా చక్కగా చిత్రీకరించబడ్డాయి

ఫ్యామిలీ ఎపిసోడ్స్ , ఎమోషనల్ సీన్లు

యాక్షన్ సన్నివేశాలు

డైలాగులు

మైనస్ పాయింట్స్ :

చిత్రంలో నిడివి ఎక్కువగా ఉండడంతోసులభంగా ఎడిటర్ 30 నిమిషాలు కత్తిరించిన ఆచర్యపోను అవసరం లేదు.

 DSP తన కెరీర్లో బలహీనమైన సంగీతం మహర్షికి అందించాడు.

వంశీ కొరటాల శివను అనుకరించడానికి ప్రయత్నించాడు కానీ పూర్తిగా విఫలమయ్యాడు.

సాంకేతిక విభాగం :

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. దర్శకుడు వంశీ అనుకున్న విధంగా కథను చూపించే ప్రయత్నం చేశారు సంభాషణ లు సహసంగా ఉన్నాయి. ఎడిటిగ్ విషయానికి వస్తే సినిమా నిడివి ఎక్కువగా ఉంది ఎడిటర్ తన కత్తెరకు కొంచెం పని చెప్పాలి. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది.

తీర్పు :

మొత్తంగా మహేష్ బాబు కి మహర్షి తో మరో కమర్షియల్ హిట్ దక్కిందనే చెప్పుకోవచ్చు.

రేటింగ్ 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *