జగన్ మోహన్ రెడ్డి పైన అప్పుడే విష ప్రచారం మొదలు పెట్టేశారు..!

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్
ఏర్పాటు చేసి తను నరేంద్ర మోడీతో మాట్లాడిన విషయాలను మీడియా మిత్రులకు తెలియజేశాడు. తను మన రాష్ట్ర సమస్యల గురించి మోడీతో మాట్లాడారు ఇందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి మరియు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన తెలిపినట్లు ఆయన తెలిపారు. ప్రెస్ మీట్ లో వైయస్ జగన్ చెప్పిన విషయాలను టిడిపి మరియు జనసేన పార్టీ నెగిటివ్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయని జగన్ మోహన్ రెడ్డి అప్పుడే యూటర్న్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అవి ఏమిటంటే..

  • ప్రత్యేక హోదా : జగన్ : ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి 250 సీట్లు రాకూడదు అని దేవుడిని చాలా ప్రార్థించాను కానీ అంతకన్నా ఎక్కువ వచ్చాయి. కావున మోడీకి మన అవసరం లేదు అయినా కూడా నేను ప్రత్యేక హోదా వచ్చేలాగా మోడీ పైన ఒత్తిడి తెస్తూ ఉంటాను, ఎలా అయినా ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇచ్చే లాగా చూస్తాను.

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఇలాగ ఉన్నాయి:

చంద్ర బాబు లాగానే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదా పైన యు టర్న్ తీసుకున్నారు, మాట తప్పిన కొత్త ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పైన విష ప్రచారం మొదలెట్టారు.

  • పోలవరం:

జగన్: పోలవరం కొనసాగించాల్సిన పని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. మన బాధ్యత కేవలం యుద్ధ ప్రాతిపదికన పొలవరాన్ని పూర్తి చేయించడమే..

దాని అర్థం అనవసరంగా చంద్ర బాబు కమిషన్ల్ కక్కుర్తితో కేంద్రం చెయ్యాల్సిన పనిని మన నెత్తి మీద పెట్టాడు కాబట్టి ఇది కేంద్రంతో చేయించుకుపోవాలి రాష్ట్రానికి భారం తగ్గించాలి అని..

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఇలాగ ఉన్నాయి: జగన్ పోలవరం అవసరం లేదన్నాడు. అప్పుడే మాట తప్పేసాడు. అందరికి షేర్లు చెయ్యండి.

  • మద్యపాన నిషేదం:

జగన్: మద్యపాన నిషేధమనేది ఒక రోజులో చేసేది కాదు. అలా చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బ తీసినట్టు అవుతుంది. క్రమక్రమంగా వేరే ఆదాయ వనరులు చూసుకుంటూ ఎప్పుడో చెప్పినట్టుగానే దఫాలు వారిగా నిషేదించుకుందాం. 2024కి కేవలం 5 స్టార్ హోటళ్ల లో మాత్రమే మద్యం దొరికే విధంగా నిషేధిస్తాం.. అలా సంపూర్ణంగా నిషేదించాకనే ఓట్లు అడుగుతా అన్నాడు.

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఇలాగ ఉన్నాయి: జగన్ నవరత్నాన్ని తొక్కేసాడు. అప్పుడే రెండో మాట తప్పేసాడు. మద్యపాన నిషేధం చెయ్యనన్నాడు….

ఏది ఏమైనా మన రాష్ట్ర ప్రజలు వైసిపికి ఓట్లు వేసి జగన్ ని ముఖ్యమంత్రిని చేశారు. ఒక రాజకీయ నాయకుడి పరిపాలన ఎలా ఉంటుందో ఒక్క రోజులో చెప్పలేము ఆయన పరిపాలన ఎలా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనకు కొంత సమయం పడుతుంది.