జగన్ కు బలమైన ఆయుధంలా తయారయిన యూట్యూబ్ ఫేస్బుక్..

ఒకప్పుడు ఈనాడు ఆడింది ఆట పాడింది పాట..
ఉన్న ఒకటి అరా చానెళ్లు చెప్పింది శాసనం..
ఇక చదువుకున్న మేధావుల్లా ఫోజ్ కొట్టేవాళ్ళు ఆ తొక్కలో పేపర్లు న్యూస్ చూసి అందరి దగ్గరా గుడ్డిగా వాదించి వాళ్ళు నమ్మడమే కాదు అందర్నీ నమ్మించే వాళ్ళు..
మనం ఉన్న సమాజంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు అది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎనలేని విలువ వాళ్ళు చెప్పారంటే కచ్చితంగా నిజం అని చాలా మంది నమ్మే వాళ్ళు..
ఇలా మౌత్ పబ్లిసిటీ తో ఈనాడు చంద్రబాబు ఆటలు దిగ్విజయంగా నడిచాయి..

అత్యంత బలమైన ముఖ్యమంత్రి అయిన ysr కూడా ఆ రెండు పత్రికలు అని విమర్శించేవాడు అంటే వాటి ప్రభావం అర్థం చేసుకోండి..

ఇక 2009 నుండి పత్రికలు టీవీల పైత్యం మరోసారి వికృత రూపం చూపాయి..ఇక ప్రభుత్వ కార్యాలయాలు స్కూల్ లలో వచ్చే ఈనాడు చదవడం ప్రజలపై రుద్దడం జరిగిపోయేది..
జగన్ ని అవినీతి పరుడు అసమర్థుడు అని లేని నిజాన్ని చూపించడం కోసం ఈ పత్రికలు అదనపు పేపర్లు వేసి మరి నిసిగ్గుగా బురద చల్లేవి..

ఇంత రాసినా ఉపఎన్నికల్లో జగన్ ఊహించని మెజార్టీ తో గెలవడానికి కారణం రాయలసీమ వాళ్ళు ముక్యంగా కడప జిల్లా ప్రజలు ysr ని జగన్ ని ఎన్నో ఏళ్లుగా దగ్గరి నుండి చూస్తున్నారు కనుక వీళ్ళ చిల్లర ఆరోపణలు వాళ్ళు నమ్మకుండా ఉప ఎన్నికల్లో జగన్ కి ఊహించని మెజార్టీ కట్టబెట్టారు..

ఇక 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పత్రికలు రాయలసీమ కు ఒక విధమైన న్యూస్ ముక్యంగా గుంటూరు జిల్లా నుండి పైకి వాళ్ళ అభిప్రాయం ప్రభావితం చేసేలా రాయలసీమ వాళ్ళు రౌడీలు గుండాలు అని అసత్య ప్రచారం జిల్లా పేపర్లలో మెయిన్ పేపర్లలో రాయలసీమ కు కాకుండా మిగతా ప్రాంతం పై రుద్దారు..

ఇక్కడి పరిస్థితి చూడని ఆ ప్రాంతం వాళ్ళు నిజమేనేమో అనే అపోహ కొద్దీ బలవంతంగా టీడీపీ వైపు నిలబడ్డారు..
ఇక 2019 వచ్చే సరికి జగన్ ప్రజల్లో నేరుగా చొచ్చుకొని పోయి వారి అపోహలను పటాపంచలు చేసాడు..
ఇక jio వచ్చిన దగ్గరి నుండి ఊర్లతో చదువుతో సంబంధం లేకుండా అందరూ యూ ట్యూబ్ ల ద్వారా నిజాలని వినడం చూడ్డం ప్రారంభించారు.

అప్పుడే అసలైన మార్పు మొదలయింది చంద్రబాబు అసమర్థ త అందరికి అరచేతిలో ప్రత్యంక్షం అయింది..
ఇక గూగుల్ వాయిస్ ఆప్షన్ వచ్చినంక ఇక టైప్ చెయ్యాల్సిన అవసరం కూడా లేకుండా ఏమి కావాలన్నా నోటితో చెప్పి చూడ్డం మొదలు పెట్టారు..

ఈ ఊహించని మార్పుతో పేపర్లని టీవీ లను నమ్మడం మానేశారు అందరూ స్పష్టంగా ఏ ఛానెల్ ఎవరిని అనుకూలం అనేవి చెప్తున్నారు..

వాళ్ళు ఎన్ని అసత్య ఆరోపణలు జగన్ పై చేసినా ఇవి టీడీపీ ఛానెల్ లని నిర్ధారణకు వచ్చారు..
దెబ్బకు ysr వ్యక్తిత్వం జగన్ పోరాటం పట్టుదల రాష్ట్రం పై ఉన్న ప్రేమ అందరికి తెలిశాయి..

అందుకే 2014 లో అధికారాన్ని తృటిలో చేజార్చుకున్న జగన్ ఈసారి బలంగా ప్రత్యర్థి పార్టీ గల్లంతు కావడం గ్యారంటీ..
ఖచ్చితంగా యూట్యూబ్ కి ఫేస్ బుక్ కి గూగుల్ కి కృతజ్ఞతలు చెప్పాల్సిందే..