జగన్ మద్యం పై చేసిన ప్రమాణం నేరవేరుస్తారా ?

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా రేపల్లె కు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన సంద్భంగా జగన్ మోహన్ రెడ్డి వైకాపా పథకం రంగులద్దిన పావురాన్ని ఎగరవేశాడు.
వైకాపా అధినేత జగన్ తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపానాన్ని నిషేదాన్ని అమలు చేస్తాం. ఆయన ఇది జరిగాకే 2024 ప్రజల ముందుకు ఓటు అడగటానికి వస్తానని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఊరురు మద్యం విక్రయించడం జరగటం వల్ల రాత్రి 7 దాటగానే ఇళ్లలో నుంచి ఆడబిడ్డలు బయటకు రాలేని పరిస్థితి తీసుకువచ్చారు అని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయి, ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న మహిళ తాసిల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేయడమే ఇందుకు నిదర్శనం . గుంటూరు జిల్లా రేపల్లె, కృష్ణా జిల్లా తిరువూరులలో సభలో జగన్ మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గంలో ఏ. కొండూరు మండలంలో మూత్రపిండ వ్యాధులతో 30 మంది వరక మృత్యువాత పడినా ఇంతవరకు కూడా ఒక్క డయాలసిస్ యూనిట్ కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయలేదన్నారు.
- 2023 లో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 తెలుగు సినిమాలు
- AP లో అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు
- అడిపోరుష్ టికెట్ ధర 112 రూపాయలకు వస్తుంది!
- విజయవాడలో హై ఎలిట్యూడ్ బెలూన్ ఉపగ్రహం ప్రారంభించబడింది
తాను అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ను సకాలంలో ఇవ్వడంతోపాటు విద్యార్థులకు హాస్టల్ మెస్ చార్జీల కోసం ఏడాదికి 20 వేలు ఇస్తానని చెప్పారు. 25 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులనే గెలిపించాలని. తద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. తాము కేవలం చంద్రబాబుతోనే పోరా డటం లేదని. కొన్ని పత్రికలు టీవీ ఛానళ్లతోనూ పోరాడాల్సి వస్తుందని వివరించారు.