మహా శివరాత్రి రోజు ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

Maha Shivaratri, mahashivratri special, mahashivratri special song, Maha Shivaratri Fasting Rules, Mana Telugu Nela, Shivaratri Recipes, Shivaratri Fast, Maha shivratri Fasting Rules

మహాశివరాత్రి ఇది శివ భక్తుల ప్రీతికరమైన పండుగ. శివుడుని భక్తితో కొలుస్తూ జరుపుకుంటారు. ఇది శివ, పార్వతి దేవి వివాహం జరిగిన రోజు. మహా శివరాత్రి పండుగను ‘శివరాత్రి’ అని కూడా పిలుస్తారు. శివ మరియు శక్తి యొక్క కలయికను మహాశివరాత్రి అని అంటారు. శివ రాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. పండుగ రోజు ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణల ద్వారా సమర్పించుకుంటారు . శివరాత్రి రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణలు చేస్తారు . ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం.

పండగ రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్తానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుకొంటారు . ముఖ్యంగా శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది .పండగ రోజు అంతా భక్తులు “ఓం నమః శివాయ”, శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు..ఇలా శివ రాత్రి ని భక్తులు ఎంతో ప్రేమతో ఇష్టం తో చేసుకొని శివ దేవుడి యెక్క ప్రేమకి ప్రీతి పాత్రులు అవుతారు …..!!!

Written by Karthik