భారీ రేంజ్‌లో ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక ప్రముఖ ముఖ్య అతిథులు వీరేనా.?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అత్యత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా భారీ బడ్జెర్ ని కేటాయించి ఈ సినిమా నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేస్తుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 151వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి అంచనాను రెట్టింపు చేసేలా భారీ ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తోందట సైరా చిత్ర యూనిట్. పైగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లను ఆహ్వానించారని తాజా అందిన సమాచారం. సెప్టెంబర్ మూడో వారంలో హైదరాబాద్ లోనే ఈ వేడుకను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

భారీ ఎత్తున జరగబోయే ఈ వేడుకలో సైరా టీమ్ అంతా కలిసి సందడి చేసి అభిమానులను అల్లారించన్నునదని సమాచారం. దీంతో ఇప్పటినుంచే సైర ప్రీ రిలీజ్ వేడుకపై సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

1857వ బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందించారు అని తెలిపారు. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న సైరా చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి రంగం సిద్దంచేస్తున్నారు. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారట. అక్టోబర్ 2న గాంధిజయంతి రోజున ఈ సినిమా భారీ రేంజ్‌లో ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *