‘RRR’ లో ఎన్టీఆర్ కు జోడిగా మెగా హీరోయిన్.??

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ సరసన నటిస్తుండగా, డైసీ ఎడ్గర్ జోన్స్ ఎన్టీఆర్ సరసన నటించడానికి ఎంపికైయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల హాలీవుడ్ బ్యూటీ డైసీ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్, మలయాళ బ్యూటీ నిత్యామీనన్ వీరిలో ఎవరో ఒకరు ఎన్టీఆర్ సరసన ఎంపిక అవుతారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి..

కానీ తాజా సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ పక్కన హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి.. నటించనుందని సమాచారం. ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ టీం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా, ఆమె బ‌ల్క్ డేట్స్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు చరణ్, ఎన్టీఆర్ గాయాల బారిన పడడం వల్ల చిత్ర షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరన్ తన భార్య ఉపాసనతో ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నారు.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 30, 2020 విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తుండగా, డి వి వి దానయ్య ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు.