పవన్ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదుగా !


తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వున్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి తొలి షో నుండే డిసాస్టర్ టాక్ ను తెచ్చుకున్న మొదటి రోజు 40కోట్ల వసూళ్లను రాబట్టి పవన్ స్టామినా ఏంటో చూపెట్టింది. ఈ చిత్రం తరువాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు.

ఇక పవన్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను భారీ పోటీ నడుమ స్టార్ మా ఛానల్ దక్కించుకుంది. ఈచిత్రం విడుదలై 20 సంవత్సరాలు అయినా కూడా శాటిలైట్ హక్కులకు మాత్రం డిమాండ్ తగ్గలేదు ఓవర్ నైట్ లో పవన్ ను స్టార్ హీరో ను చేసింది ఈ చిత్రం. ఇప్పటికీ ఎన్ని సార్లు టీవీ ల్లో వచ్చిన ఈ సినిమాకి అదిరిపోయే రేటింగ్స్ వస్తాయి.

ఏ కరుణాకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది. ఎస్ఎస్ సి ఆర్ట్స్ పతాకం ఫై జి వి జి రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు.