అసలు జనివా ఒప్పందం అంటే ఏంటి.? యుద్ధంలో పట్టుబడిన సైనికులను ఎం చేస్తారు ?

geneva agreement, Geneva Conference begins, Pakistan to release IAF pilot Abhinandan, What Is Geneva Agreement, IAF Pilot Abhinandan

యుద్ధం లో లేదా సరిహద్దులను దాటి వచ్చిన ప్రజలను లేదా సైనికులను యుద్ధ ఖైదీలను ఎలా వ్యవహరించాలని చెప్పే ఒప్పందమే జనివా ఒప్పందం. మొత్తమదటిగా జనివా ఓపదని 1929లో రూపొందించారు. ఐక్యరాజ్య సమితి పరిధిలోకి జనివా ఒప్పందం వస్తుంది, మానవ హక్కుల పరిరక్షణ కోసమే ఐక్యరాజ్య సమితి ఈ మార్గాలను రూపొందించింది. ఇందులో రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1949లో కొన్నీ సవరణలు చేశారు.

జనివా (Geneva) ఒప్పందం లో ప్రధానంగా నాలుగు ప్రధానాంశాలు పొందుపరిచారు.

1. అనారోగ్యం లేదా గాయాలతో పట్టుబడే సైనికులను వేధించరాదు. రంగు, ప్రాంతం, కులం, బేధాలతో వేధించరాదు. వాళ్లను హింసించడం లేదా ఉరి తీయడం చేయరాదు. గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య సహాయం అందించాలి.

2. అలాగే నావికా, వైమానిక దళాలను జెనివా ఒప్పందంలో చేర్చారు.

3. పట్టుబడిన సైనికుల ర్యాంకులు మరియు సీరియల్ నంబర్లు మాత్రమే తీసుకోవాలి. వారి దేశ రహస్యాలను తెలుసుకోవడానికి హింసించకూడదు.

4. పట్టుబడిన సైనికులకు లేదా యుద్ధ ఖైదీలకు రక్షణ కల్పించాలి. పట్టుబడిన వారిని తిరిగి వారి దేశాలకు అప్పగించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *