పెళ్లి చూపులు : అమ్మాయి నచ్చింది.. కానీ పెళ్లి వద్దు అంటున్న అబ్బాయి

Men avoid girl, love failure, breakup couple, love painful quotes ,love failures, love problems

పెళ్లి చూపుల వేళ అయింది. హలో అప్పటికే అబ్బయి తాలూకా వాలంతా, సోఫాలో కూర్చొని ఉన్నారు వాళ్లకి ఎదురుగా అమ్మాయి తరుపున వాళ్లు కూర్చున్నారు. ఓ పక్క అమ్మయి కి చాప వేసి ఉంచారు.

ఎదురుగా టీ టేబుల్ మీద ఫలహారం ఉంచారు. అమ్మాయి ని తీసుకొని రావడం తరువాయి.
అమ్మాయి ని తీసుకొచ్చి చాప మీద కూర్చో బెట్టారు. అబ్బాయి సత్యనాధ్ అమ్మయి ని పరిశీలనగా చూసాడు.

సత్యనాధ్ జేబులోనుంచి సిగరెట్ తీసి వెలిగించాడు. పక్క తన వాలంతా కంగుతిన్నారు అమ్మాయి వాళ్లు అడిగినంత కట్నం ఇస్తామన్నారు, సిగరెట్ తాగడం చూసి కట్నం తగిస్తారు ఏమో అని అబ్బాయి తండ్రి లోలోపల మధన పడుతూ వెధవని ఎంత అలవాటుఉంటే మాత్రం, ఈ సందర్భం లో తాగవచ్చునా జ్ఞానం ఉండక్కరలేదు అని కసిగా గోనుకుంటున్నాడు.

అమ్మాయి తండ్రి సత్యనాధ్ సిగరెట్ తాగడం గురించి ఫీలయ్యాడు. జీతం ఎంత అయినా కాని ఏ దుర అలవాటు లేని వాణి పెళ్లి చేయాలనుకున్నాడు అయినా ఎం చేస్తాం మళ్ళీ ఇలాంటి సంబంధం చూడాలి అంటే తన వల్ల కాదు ఇప్పటికి ఆలస్యం అయింది, సిగరెట్ గురించి ఏమైనా అడిగితే కోపగించి సంబంధం కాదని వెళిపోతే ఇంకేమైనా ఉందా, విధి లో తను తలెత్తుకోగలడా మనసుకి సర్ది చెప్పుకొని మౌనం గా కూర్చున్నాడు.

అమ్మాయి సత్యనాధ్ సిగరెట్ తాగడం గురించి కొంచెం బాధ పడిన. అలానే ఉండిపోయింది, ఈరోజుల్లో ప్రతి వాళ్లకి ఏదొక అలవాటు ఉండనే ఉంది. మంచి వాళ్లు అనుకున్న చాలా మంది పెళ్ళయాక చెడ్డవాలయ్యారు అలాంటిది ఇపుడే ఎదురైంది. అంతే కదా తన తండ్రి ఈ పెళ్ళికొడుకు తపితే మరొకరిని వెతికి పెళ్లి చేయాలంటే చాలా అవస్థ పడాలి. ఉన్నంతలో తృప్తి పడి, సంసారం సాఫీగా సాగిపోతే చాలనుకుంది. సత్యనాధ్ సిగరెట్ పడేసి. మరో సిగరెట్ వెలిగించి అమ్మయి నచ్చింది కానీ కట్నం సరిపోదు ఇపుడు ఇచ్చే రెండు లక్షలు కాకా మరో ఐదు లక్షలు కావాలి అన్నాడు.

అందరూ షాక్ లో ఉన్నారు, సత్యనాధ్ ఇలా అంటాడు అని ఎవ్వరు ఊహించలేదు ఇంత నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు అమ్మయి తరుపున వాళ్ళు తలచన లేదు అయినా వాళ్లు అంత కట్నం ఇవ్వలేరు ఆలా చూస్తుండిపోయారు.
సత్యనాధ్ తో సహా అంత లేచి వెళ్లిపోయారు.

ఎరా ఎపుడు డబ్బులంటే అసహించుకునేవాడి వి అంత కట్నం అడిగి సంస్కారం మరిచి సిగరెట్ తాగడం నీకేమైనా మతి పోయింది ఆ అని సత్యనాధ్ అక్క అడిగింది ఎం మాట్లాడవేం మళ్ళీ అడిగింది.

అదా అమ్మయి బానే ఉంది కానీ నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎంత అందం గా ఉండాలి అనుకున్నానో ఆలా లేదు. నచ్చలేదు అని చెపితే తరువాత ఆ అమ్మయి కి రావాల్సిన సంబంధాలు సరిగా రావు. అందుకని తప్పు నా మీద పెట్టుకోవడం కోసం. వాలెదురుగా సిగరెట్ కాల్చి ఎక్కువ కట్నం అడిగాను మనం వచ్చేయడం వల్ల ఆ అమ్మాయి కి ఏమి నష్టం రాదు మితిమీరిన కట్నం అడిగాడు సిగరెట్లు కాలుస్తాడు సంబంధం తప్పిపోవడం మంచిది అని అందరూ అనుకుంటారు….!!

Written by Karthik!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *