పుచ్చకాయ తినడం వల్ల పురుషులకు ఎక్కువ లాభాలు.. ఎందుకంటే?

వేసవికాలం అవడంతో ఎండలు మండిపోతున్నాయి. మనకి వేసవికాలంలో సులువుగాదొరికే పుచ్చకాయ తినడంవల్ల ఉష్ణ తాపాన్ని నుండి ఉపశమనంపొదగలము. అధిక శాతం నీటిని కలిగి ఉండే వాటిలో పుచ్చకాయ ఒకటి, అటువంటి పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఎండ నుండి తప్పించుకోవడానికి మానం ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సలాడ్స్ వంటి చల్లటి పదార్దాలు అతిగా సేవిస్తుటం. శీతాలపనియాలు, ఐస్ క్రీమ్స్ వంటివి తినడం కన్నా పుచ్చకాయ తినడం వలన అన్ని విధాల మన ఆరగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా పుచ్చకాయలోని విత్తనాలు తినడంవల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.

1. పుచ్చకాయను తినడం వల్ల నోరు ఆరిపోవడం, అతిగా దాహం వేయడం లాంటివి చాలావరకు తగ్గుతాయి. శరీరంలో ఉండే వేడి తగ్గడంతో పాటు చలువ కూడా చేస్తుంది.

2. ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ తినడంవల్ల వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుందని వైద్యులుఅంటున్నారు. అంతేకాకుండా జీర్ణశక్తిని కూడా మెరుగుపరిచే శక్తి పుచ్చకాయకు ఉందని చెబుతున్నారు.

3. పుచ్చకాయ తినడంవల్ల మగవారిలో ఏర్పడే శృంగార సమస్యను తగ్గిస్తుంది అని నిపుణులుచెబుతున్నారు.

4. పుచ్చకాయ తినడంవల్ల మన శరీరంలోని రక్తంలో ఏర్పడే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతలను కూడా బ్యాలెన్సు చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుండి కాపాడటంలో ముఖ్యపాత్రను పోసిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది.

5. పుచ్చకాయ పురుషుల్లో హార్మోన్లని పెంచుతుంది. దీనిలో ఉండే లైకోఫిన్ అనే పదార్థం పురుషుల్లోని వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

6. పుచ్చకాయ విత్తనాలలో మనకు తెలియని ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ విత్తనాలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, మాంగనీస్, జింక్‌లతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమీనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *