షాక్ : విజయశాంతి రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా..?

విజయశాంతి మహేష్ బాబు సినిమా తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ కథానాయకుడిగా నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు కి తల్లి పాత్రలో కనిపించనున్నారు. మహేష్ బాబుతో కలిసి విజయశాంతి త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఒకప్పుడు హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న విజయశాంతి ఈ సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటుందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాకు రాములమ్మ అక్షరాలు కోటి రూపాయలు ఛార్జ్ చేస్తున్నారుట. నమ్మడం కష్టమే అయినా..నమ్మక తప్పని నిజమిది.

విజయ శాంతికి కోటి రూపాయలు డిమాండ్ చేయడానికి కారణం ఆమె క్యారెక్టర్ సినిమాకి ఎంతో ఇంపార్టెంట్ అని, సినిమా మొత్తం తన క్యారెక్టర్ ఉంటుందని అందుకోసమే అంత డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ఎన్నో లేడీ ఓరియేంటెడ్ సినిమాలు స్టార్ హీరో సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక నటిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనీల్ సుకంర నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకి రానుంది.