విజయ్ దేవరకొండ కి నచ్చిన మహేష్ బాబు సినిమా ?

విజయ్ దేవరకొండ, టాలీవుడ్ లో అత్యంత ఫాలోయింగ్ కలిగిన యంగ్ హీరోలలో ఒకరు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం మరియు టాక్సివాలా సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ పొందాడు.

 ఒక ఇంటర్వ్యూలో విజయ్ తన అభిమాన సినిమాలు మరియు డైలాగుల గురించి చెప్పారు. అతనికి  టైటానిక్ మరియు పోకిరి సినిమాలు అంటే చాలా ఇష్టం అని వాటిని చాలాసార్లు చూసాడని చెప్పాడు. టైటానిక్ గురించి చెప్పనవసరం లేదు, ఇది ప్రతి ఒక్కరిని నచ్చే సినిమా మరియు మహేష్ బాబు పోకిరి సినిమా లోని ‘ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండు గాడు’ అనే డైలాగు నాకు ఇష్టం అని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది.