మన్మధుడు 2 మూవీ లో లవంగం ఎవరో తెల్సిపోయింది.!

నాగార్జున సినీ కెరియర్ లో ‘మన్మథుడు’ చిత్రం ఓ మంచి హిట్ అని చెప్పవచ్చు ఈ మూవీలో నాగార్జున కి ఎంత పేరు వచ్చిందో లవంగం క్యారెక్టర్ చేసిన బ్రహ్మానందంకి అంత పేరు తీసుకొని వచ్చింది .త్రివిక్రమ్ స్టోరీ తో విజయ్ భాస్కర్ డైరెక్షన్లో 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాగార్జున కి మంచి పేరు తీసుకొని వచ్చింది . దేవి శ్రీ రాకింగ్ మ్యూజిక్, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ లవంగం పాత్రలో బ్రహ్మానందం చేసిన కామెడీ థియేటర్స్ లలో నవ్వులు నవ్వులే ఇక అలాంటి చిత్రానికి ఇప్పుడు సెకండ్ పార్ట్ తెరకెక్కుతుంది.

‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్న అక్కినేని సమంత బెస్ట్ ఫ్రెండ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్ కు డైరెక్ట్ చేస్తున్నాడు. సోమవారం హైదరాబాద్ లో ఈ మూవీ ఓపెనింగ్ పూజ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది.ఇక సీనియర్ రైటర్ సత్యానంద్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి స్క్రిప్ట్ ని అందించగా,అక్కినేని అమల ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. హీరో నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేయగా మొదటి షాట్‌ని దేవుని పటాలపై చిత్రీకరించారు.

ఇక మన్మధుడు 2 లో లవంగం పాత్రలో వెన్నెల కిషోర్ నటిస్తున్నారు.వెన్నెల కిషోర్ కమెడియన్ గా బాగా టైంయింగ్ పంచులతో బాగా రాణిస్తున్నారు మరి వెన్నెల కిషోర్ బ్రహ్మనందాన్ని మెప్పించే విధంగా నటిస్తాడా…అలాగే త్రివిక్రమ్ లాగానే రాహుల్ పంచ్ డైలాగులు ఉంటాయా కామెడీ ఎలా ఉంటుంది అని తెర మీద చూడాలి.

ఇక ఈ చిత్రాన్ని నాగార్జున సొంత బ్యానర్ మనం ఎంటర్ ప్రైజెస్ మరియు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని పి.కిరణ్ (జెమిని కిరణ్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు…!!

Written by Karthik

  • 12
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *