వరుణ్ తేజ్ కొత్త లుక్ ఏ సినిమా కోసం అంటే?

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ ఏదిచేసిన కొత్తగా ఉంటుంది. ఏది అయినా కొత్తగా చేసే వరుణ్ తేజ్ మొదటి నుంచి రొటోన్‌కు భిన్నంగా కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. మొదటి నుంచి డిఫరెంట్ స్టోరీస్ తో అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమాను ప్రారంభించారు. ఈ తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. అలాగే ఈ మూవీలో వరుణ్‌ తేజ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు.

అలాగే వరుణ్ తేజ్ వాల్మీకి తో పాటు మరో చిత్రాన్ని కూడా వరుణ్ తేజ్ అంగీకరించారు. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో నటించనున్నారు ఈ మూవీ స్పోర్ట్స్ నేపథ్యంలో లో ఉంటుంది అని ప్రచారం లో ఉంది. ఈ సినిమా కోసం వరుణ్‌ తేజ్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్‌గా మారడానికి గత కొన్ని రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో బాక్సింగ్‌లో శిక్షణ లాస్ ఏంజెలెస్‌లో తీసుకుంటున్నారు. అలాగే తను ఇంగ్లండ్‌కు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్, సమ్మర్ ఒలింపిక్స్ మెడలిస్ట్ టోనీ జెఫ్రీస్ ట్రైనింగ్ లో గత రెండు నెలలుగా వరుణ్ శిక్షణ పొందుతున్నారు.

దీనికి సంబందించిన ఫోటో ని వరుణ్ తేజ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు ఆలా చేసిన ఫొటో కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోలో ట్రైనర్ టోనీ‌తో కలిసి ఉన్న వరుణ్ తేజ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ‘F2’ సినిమాలో చూసిన వరుణ్‌కు ఈ ఫొటోలో ఉన్న వరుణ్‌ గుర్తు పట్టలేనంత తేడా వచ్చేసింది. గుబురు గడ్డం, మీసాలు, గాగుల్స్, వెస్ట్రన్ స్టైల్ జాకెట్, షార్ట్స్‌తో అచ్చం ఇంగ్లిష్ మ్యాన్‌లా వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు.వరుణ్ ఫోటో తో పాటు ట్రైనింగ్ గురించి ఈ విధంగా గా పోస్ట్ చేసాడు ‘గత రెండు నెలలుగా ఈ వ్యక్తితో శిక్షణ అద్భుతంగా గడిచింది. టోనీ జెఫ్రీస్ నిన్ను మిస్ అవుతాను. త్వరలోనే మళ్లీ శిక్షణకు వస్తా!’ అని వరుణ్ పేర్కొన్నారు.

Written by Karthik!!

  • 1
    Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *