మహేష్ సినిమాలో నటించబోతున్నా ఇద్దరు సీనియర్ స్టార్స్ ?

మహేష్, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మూవీ సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాలో ఇద్దరు సీనియర్‌ స్టార్స్‌ నటించబోతున్నారు . ఈ చిత్రంలో విజయశాంతి, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ మూవీ లో నటించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి, గతంలో ఒక సినిమాలో మహేశ్, విజయశాంతి కలిసి నటించారు. 1989లో వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా లో విజయశాంతి, మహేశ్ తల్లీకొడుకులుగా నటించారు.

మహేశ్‌ 26వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా ఖరారైనట్లు తెలిసింది.

  • 8
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *