ఇండియా లోని బెస్ట్ 6 హనీ మూన్ ప్రదేశాలు ! Most Romantic Honeymoon Destinations In India

ఇండియా లోని టాప్ 6 హనీ మూన్ ప్రదేశాలు

కొత్త గా పెళ్లి అయిన నూతన వధూవరులు ఏకాంతంగా గడపడానికి మధురమైన క్షణాలను అనుభవించడానికి, ఉల్లాసంగా గడపడానికి కొన్ని రోజుల పాటు అందమైన, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు. ఈ విధంగా నూతన వధూవరులు మానసికంగా మరియు శారీరకంగా ఒకటైయెందుకు జరుపుకునే యత్రనే హనీమూన్ అంటారు.

భారతదేశంలో ఉన్న హనీమూన్ స్థలాల జాబితా  మీకు అందిస్తున్నాము, ఈ జాబితా మీకు  ఎంపికలను తగ్గిస్తుంది,  మీ భాగస్వామితో ఎంకంతంగా గడపడానికి కింద ఉండే జాబితా మీకు ఉపయోగపడుతుంది ఆ హానీ మూన్ ప్రదేశాలు ఏంటో చూదాం…

 

1. గోవా :

Most Romantic Honeymoon Destinations In India

గోవా, ఇది భారతదేశంలోని ప్రసిద్ధ హనీమూన్ ప్రదేశాలలో ఒకటి.  అన్ని సందర్భాల్లో వేడుకలు చేస్కొడానికి అందరు గోవా వెళ్తూ ఉంటారు . భారతదేశంలోని ఉత్తమ బీచ్ లలో మీ ప్రేమికునితో నిశ్శబ్ద శృంగార సమయాన్ని గడపడానికి అనువైన ప్రదేశం. సాయంత్రం వేళ బీచ్ లలో మీ భాగస్వామితో ఏకాంత సమయాన్ని గడపడానికి అనువైన ప్రదేశం.

 

2. శ్రీనగర్ :

Romantic Honeymoon Destinations In India

శ్రీనగర్, భారతదేశం లో అత్యంత శృంగార హనీమూన్ ప్రదేశాలలో ఒకటి. శ్రీనగర్ ని భూమి మీద ఉన్న పరలోకము అని పిలుస్తుంటారు. శ్రీనగర్ యొక్క అందం పూర్తిగా మిమల్ని మీరు మర్చిపోయేలా చేస్తుంది.  శ్రీనగర్ లోని సరుసులు నుండి వచ్చే చల్లని గాలులు వలన మీ భాగస్వామిలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం గా ఉంటుంది.దాల్ సరస్సు పై మీ భాగస్వామితో  విహరించడానికి అనువైన ప్రదేశం.

 

3. ఊటీ :

Most Romantic Honeymoon Destinations In India

బారతదేశం లోని  సుందరమైన ప్రదేశాలలో ఊటీ ఒకటి. చిన్న కుటీరాలు విస్తారమైన ప్రకృతి దృశ్యాలు, నీలగిరి హిల్స్ యొక్క మనోహరమైన సౌందర్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చట అంతటా వ్యాపించి ఉన్నాయి. ఊటీ లో మీ భాగస్వామితో ఈ మనోహరమైన అనుభూతిని ఆనందించి, హనీమూన్ విజయవతం చేస్కోవచ్చు. మీ భాగస్వామి తో గడపడానికి  భారతదేశంలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఊటీ ని ఎంచుకోవచ్చు.

 

4. బ్యాక్ వాటర్స్, కేరళ :

Most Romantic Honeymoon Destinations In India

మీ జీవిత బాగాస్వమితో తప్పనిసరిగా వెళ్లవలసిన ప్రదేశాలలో కేరళ ఒకటి. ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన శృంగార అనుభవాన్ని పంచుకోవడనికి అనువైన హనీమూన్ స్పాట్. ఇక్కడ నదులు, పచ్చని చెట్లు, ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలను మీ బాగస్వామి తో చూడాలని అనకుంటే కేరళ అనువైన ప్రదేశం. సాంప్రదాయ పద్ధతిలో మీ కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన హనీమూన్ బోటులో షికారు చేస్తే ఎంత మధురంగా ఉంటుందో ఉహించుకోండి.

 

5. కూర్గ్, కర్ణాటక :

Most Romantic Honeymoon Destinations In India
Pic Credits : Wikipedia

కూర్గ్ ని స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. పచ్చ పచ్చని కొండల మధ్య మరియు కూర్గ్ యొక్క పరిసర ప్రాంతాలు మీ జీవిత బాగస్వామితో మిమల్ని మరింత దగ్గర చేస్తుంది..కనుచూపు మేరలో పచ్చదనం, నారింజ తోటల పరిమళాలు.. రద్దీ లేకుండా ఉండే  ప్రశాంత వాతావరణం కోరుకునేవారికి కూర్గ్ ప్రదేశం మీకు నచ్చేస్తుంది.

 

6. లక్షద్వీప్ :

Most Romantic Honeymoon Destinations In India

ఒక లక్ష ద్వీపాల సముదాయే లక్షద్వీప్.  లక్షద్వీప్ లోని ప్రదేశాలు ప్రేమ మరియు ప్రేమ యొక్క అనుభూతిని తెలియజేస్తుంది. మీరు నమ్మలేకపోతే అక్కడి పచ్చిక తీరాలు మరియు సముద్ర జలాల మధ్య మీ భాగస్వామితో ఎకతంగా గడపడానికి ప్రయత్నించండి. చుట్టూ సముద్రం, మధ్యలో మీరు మీ జీవిత భాగస్వామి ఓ సారి ఊహించుకోండి. ఆ అనుభూతి ఎంత బాగుంటుందో కదా !! ఇంకా నీలి సముద్రం మధ్యలో తెల్లని ఇసుక తీరాలలో మీరు మీ జీవిత భాగస్వామి తో చెట్టపట్టాలేసుకుని, ఊసులు చెప్పుకుంటూ.. సాగిపోతే ఎంతో రొమాంటికో కద.