టిడిపి చేస్తున్న ఫిర్యాదుకు వర్మ భయపడతారా ?

Lakshmis NTS

కాంట్రవర్సీ కింగ్ అంటే మనకు మొదటిగా గుర్తుకు వచ్చేది “రాంగోపాల్ వర్మ”. చిత్ర పరిశ్రమలో ఇయన తెలియని వారు ఉండరు. ప్రతుతం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ని లక్ష్మీ’s NTR గా తెరకెకునుంది. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ గారి జీవితంలో జరిగిన యధార్ధాలను మాత్రమే చూపిస్తానని ఇటీవలే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఎన్టీఆర్ అభిమానులు ఇ సినిమా విడుదల కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇ నేపథ్యంలో టీడీపీ నాయకులు రాంగోపాల్ వర్మకు భారీ షాక్ ఇచ్చారు. తాజాగా టీడీపీ నాయకులు ఎన్నికల కమీషన్ అధికారికి చిత్రం నిలిపివేయాలంటు ఫిర్యాదు చేశారు. ఇ చిత్రంలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పాత్రని నెగటివ్ గా చిత్రకారిస్తున్నారు అని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల ముందు విడుదలైతే ఓట్ల పై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు వర్మ తన సినిమాపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారని ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు.

  • 1
    Share