బహుబలి తర్వాత అదే స్థాయిలో తెలుగు సినిమా రుచి చుపించబోతున్న సైరా

భారతదేశం మరచిపోయిన మొదటి తిరుగుబాటు దారుడు అయిన ఉయలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సై రా టీజర్ విడుదలైంది.

నరసింహ రెడ్డి గురించి పరిచయాన్ని ఇస్తు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభం కావడంతో అభిమానులు ఎక్కువ ఆనందంగా ఉన్నారు.

సైరా టీజర్ లో చిరంజీవి నరసింహ రెడ్డిలా కనిపిస్తూ రోమాలు నిక్కబొడుచునేలాగ చేశాడు. సురేందర్ రెడ్డి ఈ మెగా బడ్జెట్ చిత్రాన్ని ఎలా తీసివేశాడో అని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే మనకు సై రా మరో బాహుబలి వంటి గొప్ప చిత్రము అవుతుంది అనిపిస్తుంది. తెలుగు సినిమా పరిధిని చూపించిన బాహుబలి దిశలో సై రా వెళ్తాడు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ మరియు యాక్షన్ ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తాయి మరియు టీజర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది.

టీజర్ చూసిన తర్వాత సినీ ప్రేమికులు దీన్ని వెండితెర పైన చూడటానికి ఆసక్తి ని పెంచుకుంటారు. సై రా అక్టోబర్ 2 న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం లో అమితాబ్ బచన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, నయనతార మరియు తమన్నా వంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాత అయినటువంటి రామ్ చరణ్ మేకింగ్ కోసం ఎంతో ఖర్చు చేశారు.