చిరంజీవి వల్ల దెబ్బతిన్న రామ్ చరణ్.!

రామ్ చరణ్ యొక్క కొణిదెల బ్యానర్ లో విడుదలైన రెండో సినిమా ‘సైరా నరసింహ రెడ్డి’ . చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం తో ఈ చిత్రాన్ని ఆయన కెరియర్ లో ఓ మైలు రాయిగా సైరా చిత్రాన్ని నిలపాలని చరణ్ నిర్మించారు. అయితే ఈ సినిమా వల్ల చరణ్ కు భారీ నష్టాలే వచ్చినట్లు తేలింది. సినిమా బాగున్నప్పటికీ సినిమా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్త వహించక పోవడం దీనికి కారణం.

తెలుగు రాష్ట్రాలలో ‘సైరా నరసింహ రెడ్డి’ డిస్ట్రిబ్యూటర్స్ లాభ పడ్డారు కానీ బాలీవుడ్ లో గట్టి దెబ్బ తగిలిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో కొన్ని ఏరియాలలో సైరా చిత్రాన్ని స్వంతంగా విడుదల చేసుకున్నారు. అయితే అక్కడ వచ్చిన షేర్ కన్నా విడుదలకి అయినా ఖర్చు ఎక్కువ అవ్వడం వలన చరణ్ కి దాదాపు పది కోట్ల వరకు సైరా నష్టాలను మిగిల్చిందని తేలింది.

అలాగే ‘సైరా నరసింహ రెడ్డి’ లో స్టార్ హీరోలు అయిన కిచ్చ సుదీప్, విజయ్ సేతపతి నటించిన కూడా తమిళ, కర్ణాటక మరియు మలయాళ వర్షన్ లలో కూడా నష్టాలే తెచ్చిపెట్టింది. అలాగే ఓవర్ సీస్ బయ్యర్లు కూడా భారీగా నష్టపోయారు. చిరంజీవి వల్ల చరణ్ కు గట్టి దెబ్బ పడిందని తెలుస్తుంది.