SV యూనివర్సిటీలో పీజీ కోర్సు ప్రవేశానికి మే 7th 2019న చివరి తేదీ

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ( SV University) 2019-20కి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఎంఏ-అడల్ట్ ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ వంటి వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనునట్లు అధికారులు ప్రకటించారు.

పీజీ కోర్సులు : ఎంఏ-అడల్ట్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, ఆక్వాకల్చర్, జియోగ్రఫీ, రూరల్ డెవలప్‌మెంట్; ఎంఎస్సీ-ఆంత్రోపాలజీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ; ఎంఎస్-ఫుడ్ టెక్నాలజీ తదితర కోర్సులు…

విద్య అర్హత : బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు తగిన ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300; ఇతరులకు రూ.400.

దరఖాస్తుకు చివరితేదీ : మే 7, 2019.

హార్డ్‌కాపీ పంపడానికి చివరితేదీ : మే 13, 2019.

పరీక్ష తేదీ : మే చివరి వారం 2019లో ఉంటుంది.

పూర్తి వివరాలు www.svudoa.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *