వేసవిలో చర్మ సంరక్షణకు మనం తీసుకోవల్సిన జాగ్రత్తలు !!

summer care of skin, summer skin care tips, summer dry skin care, summer skin care home remedies, summer skin care in telugu, summer skin care at home, skin care Tips,

వేసవికాలం మర్చి నుండి జూన్ వరకు ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. వేసవికాలంలో వచ్చు అనారోగ్య సమస్యలు – వడ దెబ్బ, అతిసారం మరియు వాంతులు, అమ్మోరు, గవదబిళ్లలు మరియు అతిసారం మరియు వాంతులు. వాతావరణం లో రాబోయే కఠినమైన మార్పుల వలన వేసవి లో మన చర్మం మీద చెమట, వేడి మరియు కాలిన గాయాలు సున్నితమైన చర్మంపై మోటిమలు, మొండి చర్మం మరియు మచ్చల కు దారి తీయవచ్చు. వేసవి కాలంలో చర్మం పొడిబారడం, చర్మం వదులుగా అయిపోవడం పేలవంగా తయారవ్వడం లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది..ఎక్కువగా వేసవిలో డీ హైడ్రేషన్ కి లోనువ్వడం వలన చర్మం మరింతగా పొడిగా అయిపోతుంది.

ఇక్కడ కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలు ఉన్నాయి వీటిని శ్రద్ధగా అనుసరించినట్లయితే, మీ చర్మాన్ని వేసవి లో కాపాడుకోవచ్చు.

  1. పెరుగును మన ముఖానికి పట్టించుకోవడం వలన చర్మం చర్మానికి తేమగా మారుతుంది, పెరుగు వలన మన ముఖాన్ని తక్షణం మెరిసేలా చేసుకోవచ్చు. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్ పట్టించడం వలన వేడి వలన వచ్చే మచ్చల నుండి ఉపశమనం పొందవచ్చు.

  2.  వేసవి లో వేడి నీటితో కాకుండా చల్లని నీటితో స్నానం చేయడం వలన మన దేహం లో వేడి తగ్గుతుంది.

  3. పండిన నారింజ తొక్కలతో పొడి అర టీస్పూను తీసుకుని మరియు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపైన అప్లై చేసుకోవాలి. ఇలాగ చేస్కున్న తర్వాత ఒక గంటపాటు ఈ మిశ్రమాన్ని ఆరేవరకూ చల్లని ప్రదేశం లో కూర్చోవాలి. దీనివలన వేసవిలో ముఖంపై ఏర్పడే వడ దెబ్బ లని తగ్గించి చర్మంపై తేమ పెరిగేలా చేస్తుంది.

  4. అర టీస్పూన్ చెక్కెర పొడి, 1 టీ స్పూన్ నిమ్మ రసం, 3 లేదా 4 చుక్కల రోజ్ వాటర్ ను వేసి ఒక మిశ్రమంగా చేసుకోవాలి ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖం పైన పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్కోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై వచ్చే నల్లని మచ్చలను మరియు మృత కణాలని నాశనం చేస్తుంది.
  • 3
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *