వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే.. తీసుకోవలసిన జాగ్రత్తలు

ఎండలు ఎక్కువైపోతున్నాయి . బైటికి వెళ్తే తట్టుకోలేని ఎండలు . ఇక మన శరీరంలో కూడా చెప్పలేనంత వేడి. ఇక ఎండ కాలం వచ్చిందంటే రకాల సమస్యలు . వాటి కోసం మనం తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు.
1.మొదట నీటిని ఎంత తీసుకుంటే శరీరం అంత వేడి చేయదు.

2.సి విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లని ఎక్కువ గా తీసుకోవలసి ఉంటుంది
3.మజ్జిగలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరం లో వేడి పారిపోతుంది.
4.పుచ్చకాయ, కీరదోస కూడా ఎక్కువ గా నీటిని కల్గి ఉంటాయి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరాన్ని తేమగా ఉంచుతాయి.

5.బాగా వేడి చేసింది అనిపిస్తే చల్లని నీటిలో కొంచెం పంచదార కలుపుకుని తాగితే వేడి చిటికెలో తగ్గుతుంది
6.ఎర్ర ముల్లంగి కూడా నీటి శాతం ఎక్కువ కాబట్టి తీసుకోవడం మంచిది
7.నువ్వుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచి ఉదయానే ఆ నువ్వుల నీటిని వడగట్టి తాగితే వేడి చేయదు.శరీరం చల్లబడుతుంది.
8 చల్లని పాలలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే తీసుకుంటే బయటకు వెళ్లినా మనకి వడదెబ్బ లాంటివి తగలవు.
9.ఉదయం రాగిజావ తాగితే వేడి తగించడం లో ఎంతో సహాయం చేస్తుంది , శరీరానికి కావలసిన శక్తి కూడా లభిస్తుంది.

10.కలబంద రసాన్ని ఒళ్లంతా రాసుకుని, కాసేపటి తరువాత స్నానం చేస్తే శరీరం లో వేడి తగ్గుతుంది.

11.పండ్ల రసాలు తీసుకోవడం వల్ల , వడదెబ్బ నుండి మనల్ని కాపాడతాయి.
12.చెరకు రసం, కోబ్బేెరినీళ్ళు కూడా శరీరం లోని వేడిని బయటికి పంపడం లో ఎంతగానో సహాయం చేస్తాయి

Written by Karthik