రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే?

సినిమా అభిమానుల నుండి మహేష్ బాబు చాలా సార్లు ఎదురుకుంటున్న ప్రశ్న మీరు రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తున్నారు అని, అయితే ఈ ప్రశ్నకు మహేష్ నుండి సరైన జవాబు వచ్చేది కాదు.

మహర్షి సినిమా ప్రమోషన్స్ లో పాత్రికేయుల నుండి రాజమౌళి తో సినిమా ఎప్పుడు అనేదానికి సమాధానం ఇస్తూ సినిమా స్క్రిప్ట్ జరుగుతుందని, ఈ సినిమా ‘RRR’ విడుదల అయిన వెంటనే మొదలవుతుంది. రాజమౌళి అన్ని రకాల సినిమా అభిమానులకి నచ్చేలా స్క్రిప్ట్ రెడి చేస్తున్నారు అని చెప్పారు.

ప్రస్తుతం ‘బాహుబలి’ డైరెక్టర్ ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్లతో కలిసి ‘RRR’ చిత్ర దర్సకత్వంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూ .350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు డివివి దానయ్య.

మహేష్ బాబు మనకు చెప్పినట్లు అన్ని అనుకున్నట్లుగా జరిగితే వీళ్లఇద్దరి కలయికలో 2020 చివరిలో సినిమా మొదలవుతుంది.

మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రవిపూడి యొక్క మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *