నన్ను ప్రోత్సహించేది వాళ్లే – సన్నీ లియోన్

“రంగీలా” మరియు “వీరమదేవి” వంటి చిత్రాలతో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో నటిస్తున్న సన్నీ లియోన్ తన క్రేజ్ పెరగటానికి ఈ చిత్రాలు తనకు ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటుంది.

ఏ పనైనా అంత కష్టం కాదు, మీరు చేసే పనిని ఆనందిస్తూ, ఆసక్తిగా చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ ని పొందగలం, అందుకే నేను చేసే చిత్రాలను కష్టం తో కాకుండా ఇష్టంగా చేస్తాను. ప్రస్తుతం నటిస్తున్న రంగీలా” మరియు “వీరమదేవి” చిత్రాలు సౌత్ లో నాకు మంచి పేరు తెచ్చి పెడతాయి అని సన్నీ అన్నారు.

అలాగే సౌత్ ఇండస్ట్రీ గురించి చెబుతూ నేను ఒక కొత్త సంస్కృతి గురించి నేర్చుకోవడాన్ని నేను ఇష్టపడతాను మరియు ఎంతో ఆస్వాదించగలను, నేను కెరియర్లో ఉన్నత స్థాయికి వెళ్లడానికి సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.

ప్రస్తుతము సన్నీ లియోన్ రంగీలా” మరియు “వీరమదేవి” చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రమైన “కోకా కోలా” అనే హర్రర్ చిత్రం లో నటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *