గుడ్ న్యూస్ : టెన్త్ స్టూడెంట్స్‌కు మ్యాథ్స్ పేపర్‌లో అదనంగా 6 మార్కులు

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త. ఇటీవల రాసిన మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌లో దొర్లిన తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు టెన్త్ బోర్డు నుండి తీపి కబురు అందింది. తప్పులు దొర్లిన ప్రశ్నలకు అదనపు మార్కులు కలపాలని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC) నిర్ణయించింది అని అధికారులువెల్లడించారు. పరీక్షల్లో తప్పుగా ఉన్న ప్రశ్నలకు సమాధానం రాసే ప్రయత్నం చేసిన విద్యార్థులందరికీ ఆరు (6) మార్కులు కలుపుతామని ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవలే స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయమంటూ అధికారులు స్పష్టంచేసారు.

టెన్త్ మ్యాథ్స్ పేపర్ 1లో ఐదున్నర (5 1/2)మార్కులు మరియు మ్యాథ్స్ పేపర్ 2లో అరమార్కు (1/2) కలపనున్నట్లు అధికారులుధృవీకరించారు. టెన్త్ పేపర్ 1లోని పార్ట్ ఏ (part-A) లో ఆరో (6) ప్రశ్నకు ఒకమార్కు (1 mark), 16వ ప్రశ్నకు 4 మార్కులు(4 marks), పార్ట్ బీలోని 7వ ప్రశ్నకు అరమార్కు(1/2 mark), పేపర్ 2 పార్ట్ బీలో 4వ ప్రశ్నకు అరమార్కు(1/2mark) యాడ్ చేయనున్నారని బోర్డుఅధికారులు వెల్లడించారు.

  • 8
    Shares