కూల్ డ్రింక్స్ త్రాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే నష్టాలు..!

సాధారణంగా మనం కాలానికి అతీతంగా శీతలపానీయాలను సేవిస్తుటం. ముఖ్యంగా గమనిస్తే వేసవి కాలంలో ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్ త్రాగాలని ఆశక్తి చూపుతుంటారు. అయితే, ఈ కూల్‌డ్రింక్స్‌ను సేవించే ముందు మనం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. చల్లటి పానీయం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌ కి రుచికరమైన మరియు ఆకర్షణీయమైనరంగుల కోసం వివిధ రకాలైన కెమికల్స్ ని కలపడం వలన గొంతు, దంతాలు, జీర్ణక్రియపై ఈ చల్లటి పానీయం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

1. చల్లటి పానీయాలు అధికంగా తీసుకునేటట్లయితే మన శరీరం దానిని ఎంతవరకు స్వీకరిస్తుందో అని ముందుగా జిక్మనించాల్సి ఉంటుంది.

2. సోడాలాంటి శీతలపానీయాలను త్రాగేటప్పుడు సిప్ చేస్తూ సేవించరాదు ఎందుకంటే అలా త్రాగితే దంతాలు తియ్యటి ఆమ్లాలతో దంతాలు పూర్తిగా తడిసి వాటిపై ఉండే ఎనామిల్ పోత పాడైపోయే ప్రమాదం ఉంది. ఎనామిల్ పోత కోల్పోవడంవల్ల దంతాలకి సంబంధించిన రోగాల బారినపడే అవకాశం ఉందని వైద్యులుహెచ్చరిస్తున్నారు కాబట్టి చల్లటి పానీయాలకు వీలైనంతదూరంగా ఉండాలని వైద్యులుచెబుతున్నారు.

3. మరి ముఖ్యంగా మీరు ఎంత మోతాదులో క్యాల్షియం తీసుకుంటున్నారో తెలుసుకోండి. చల్లటి శీతల పానీయాలు మన ఆహారంలోని క్యాల్షియంను మాత్రమే కాకుండా మన ఎంశరీరంలోనున్న క్యాల్షియంను కూడా హరించివేస్తాయి అని ఎన్నో పరిశోధనలలో తేలింది. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా శీతల పానీయాలు తీసుకోకపోవడం కొంతవరకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఓ మోస్తరు చల్లగా వున్నవాటిని ఎంచుకోవడం మంచిది అని చెబుతున్నారు.